Nalgonda Man dies in US: అయ్యో.. వారం క్రితమే యూఎస్‌లో జాబ్.. జింక అడ్డువచ్చి నల్గొండకు చెందిన టెకీ దుర్మరణం.!.
Telangana Man dies road accident in Us: ఉద్యోగం వచ్చిన వారంకే నల్గొండకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాకరంగా మారింది.
Nalgonda youth died in road accident in America: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది యువతీ, యువకులు ఉద్యోగం, ఉపాధి కోసం యూఎస్ కు తరచుగా వెళ్తుంటారు. అక్కడ ప్యాకేజీలు , అవకాశాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది అమెరికాలో ఉన్నత చదువులు లేదా జాబ్ లను తమ డ్రీమ్ గా పెట్టుకుంటారు. ఈ క్రమంలో ట్రంప్ వీసాలపై తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయులు యూఎస్ కు వెళ్లడం అంటే కొంత జంకుతున్నారు. మరోవైపు యూఎస్ కు వెళ్లిన భారతీయులు కొన్ని సందర్బాల్లో అనుకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నల్గొండ జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు యూఎస్ లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
నల్గొండ జిల్లాలోని మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ (25) ఇటివల యూఎస్ కు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. దీంతో కొన్ని రోజుల క్రితమే మంచి కంపెనీలో జాబ్ రావడంతో ఇంట్లోవారితో తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో తమ కొడుకు డ్రీమ్ నెరవేరిందని కన్నవాళ్లుసైతం ఆనందంలో మునిగితెలారు. ఈ క్రమంలో సాయితేజ ఆఫీస్ కు వెళ్లి కారులో ఇంటికి వస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక జింక కారుకు అడ్డం వచ్చింది.
దీంతో సడెన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పలు మార్లు బోల్తా పడింది. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాలు కూడా ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న యూఎస్ పోలీసలు సాయితేజను కారు ప్రమాదం నుంచి బైటకు తీశారు. అప్పటికే అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో పోలీసులు సాయితేజను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వెంటనే యూఎస్ లో ఉన్న అతని ఫ్రెండ్స్ కు సమాచారం అందించారు. ఈ విషయం కాస్త నల్గొండలో ఉంటున్న కుటుంబ సభ్యులకు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు డ్రీమ్ నెరవేరిందనే ఆనందంలో ఉండగానే దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ ఆ తల్లిదండ్రులు రోదించడం అందర్ని కలిచివేసింది. దీంతో మనుగోడులో సాయితేజ మరణంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.