SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రోమ్ వీధుల్లో 9 ఏళ్లుగా భిక్షాటన చేసి.. పెద్ద ఇల్లు కట్టిన నైజీరియా వ్యక్తి!

Migrant Success Story: ఇటలీలోని రోమ్ వీధుల్లో ఓ నైజీరియన్ వ్యక్తి దాదాపు 9 ఏళ్ల పాటు భిక్షాటన చేసి స్వదేశంలో అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఇతడికి సంబంధించిన సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఆ వ్యక్తి వీధుల్లో భిక్షాటన చేశాడు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 01:02 PM IST | Updated: Oct 06, 2026, 01:06 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Migrant Success Story In Telugu: బతకడం కోసం స్వదేశాన్ని విడిచి పరాయి గడ్డపైకి వెళ్లే వలసదారుల జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అద్భుతమైన భవిష్యత్తుతో పాటు కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా విదేశాలకు వెళ్లేవారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు.. అయితే, ఉపాధి కోసం యూరప్ వెళ్ళిన ఓ నైజీరియా దేశస్థుడు ఎంచుకున్న మార్గం.. సాధించిన ఫలితం ఇప్పుడు అంతర్జాతీయ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది..


నైజీరియాకు చెందిన ఒక వ్యక్తి సుమారు 9 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఇటలీ రాజధాని రోమ్ నగరానికి వెళ్ళాడు.. భాషా సమస్యలతో పాటు ఎక్స్పీరియన్స్ లేకపోవడం కారణంగా సరైన గుర్తింపు కార్డు పొందలేకపోయాడు. దీని కారణంగా అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో అతడు.. అక్కడే ఉంటూ వీధుల్లో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. నగరంలోని విపరీతంగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో.. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో నిత్యం ప్రజలను, అక్కడికి వచ్చిన టూరిస్టులను యాచిస్తూ రోజును గడపడం మొదలుపెట్టాడు..

అయితే, ఇక్కడే అతడి కథ కొత్త మలుపు తిరిగేసింది.. ఇటలీ వీధుల్లో దాతలు వేసే చిల్లర నాణాలతో పాటు టూరిస్టులు వేసే కాగితపు కరెన్సీ అతడు వృధా చేయకుండా ఎంతో క్రమశిక్షణతో కూడబెట్టుకున్నాడు. యూరోపియన్ కరెన్సీ మారకం విలువ నైజీరియన్ నైరాతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండడంతో.. ఇటలీలో రోజు భిక్షాటన చేయగా వచ్చిన చిన్న మొత్తంలో డబ్బులు స్వదేశానికి పంపించి.. నైజీరియా కరెన్సీలో బాగా సంపాదించాడు..

గత తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ సంపాదనతో అతడు నైజీరియాలో ఉంటున్న తన కుటుంబానికి ఎంతో ఆర్థికంగా బలాన్ని అందించాడు. పిల్లల చదువుల ఖర్చులను ఎంతగానో భరిస్తూ వచ్చాడు.. ఇంతటితో కాకుండా స్వదేశంలో సొంతగా ల్యాండ్ కొనుగోలు చేసి.. ఒక అద్భుతమైన ఇంటిని కూడా నిర్మించుకున్నాడట.. అయితే, నైజీరియా కు వెళ్లిన సందర్భంలో.. అక్కడే ఉన్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇతని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ గత తొమ్మిది సంవత్సరాలుగా అతను ఇటలీ వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని.. ఇక్కడ తనకు భారీ మొత్తంలో లభించిన ఆదాయంతో నైజీరియాలో తన కుటుంబానికి అద్భుతమైన ఇల్లును కట్టించారని.. తన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉందని ఆయన స్వయంగా వెల్లడించారు..

ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించిన సక్సెస్ స్టోరీ ఇంటర్నెట్లో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. అతని సక్సెస్ స్టోరీ విన్న సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు స్వదేశంలోని కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ పని చిన్నది కాదంటూ అతడి పట్టుదలను అద్భుతంగా సమర్థిస్తూ వస్తున్నారు.. కొంతమంది మాత్రం విదేశీ చట్టాలను ఉల్లంఘించి.. వీధుల్లో భిక్షాటన చేయడం సరైన పద్ధతి కాదని విమర్శలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కారణం ఏదైనాప్పటికీ విదేశీ వీధుల్లో భిక్షాటన చేస్తూ స్వదేశంలో ఇంటి యజమానిగా మారిన ఈ వలస జీవిత కథ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది..

గమనిక.. ఇక్కడ ఆ వ్యక్తి పేరును వెల్లడించలేక పోవడానికి గల కారణాలు అతడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని మాత్రమే.. కాబట్టి, అతని వ్యక్తిగత ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా ఉండడానికి అతని పేరును ఎక్కడ వినియోగించలేదు. పాఠకులు కూడా అర్థం చేసుకొని చదవాలని జీ తెలుగు న్యూస్ భావిస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES