రూ.450 కోట్లకు అమ్ముడైన డైనోసార్ అస్థిపంజరం.. ఇంత ధర పలకడానికి అసలు కారణాలివే!
Dinosaur Skeleton: ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ డైనోసార్ అస్థిపంజరానికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, ఇది ఏకంగా రూ.450 కోట్లకు పైగానే అమ్ముడు పోయింది. అయితే, ఇంత ధరకు విక్రయించడానికి కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Dinosaur Skeleton: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువలైన వస్తువులంటే బంగారంతో పాటు వజ్రాలు, విలువైన భవనాలు మాత్రమే కాదని ఇటీవలే జరిగిన ఓ ఘటన నిదర్శనంగా మారింది.. దాదాపు కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ జాతికి చెందిన ఒక అరుదైన అస్థిపంజరం ఊహకందని ధరకు విక్రయించారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న సోథెబీస్‌లోని వేలంలో జరిగిన నానోటైరనస్ జాతికి సంబంధించిన అస్థిపంజరం ఏకంగా 4.73 కోట్ల డాలర్ల(భారత కరెన్సీలో రూ.450 కోట్లకు పైనే)కు అమ్ముడుపోయి.. చరిత్రలో నిలిపోయింది. అయితే, ఇంతలా అమ్ముడుపోవడానికి గల కారణాలు, అసలు దీనిని ఎవరు విక్రయించారు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే, ఈ వేలంలో భాగంగా డైనోసార్ అస్థిపంజరానికి జోడీ అని పేరు పెట్టారు.. అయితే, ఈ వేలం మొదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరుగురు ప్రముఖులు 12 నిమిషాల పాటు ఆగకుండా వేలంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ అస్థిపంజరం విలువ 60 లక్షల నుంచి 90 లక్షల డాలర్ల వరకు పలకే ఛాన్స్ ఉందని నిపుణులు మొదట అంచనా వేసినప్పటికీ.. వాకి పోటీతో ఆ అంచనాలన్నీ తలకిందులై.. ఊహించిన దానికంటే దాదాపు ఐదు రెట్లకు పైగా ధరలు పలికినట్లు తెలుస్తోంది.. మానవ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన డైనోసార్ అస్థిపంజరాల్లో ఇది రెండో స్థానంలో నిలిచిందట..
ఈ జోడీ అస్థిపంజరం సుమారు 9.6 అడుగుల ఎత్తుతో పాటు.. 19.6 అడుగుల పొడవు కలిగి ఉందని సమాచారం.. అంతేకాకుండా అత్యంత క్రూరమైన డైనోసార్ పేరున్నటీ-రెక్స్ డైనోసార్‌కు ఇది చిన్న తరహా బంధువు లాంటి జాతి అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలా చెక్కుచెదరని స్థితిలో దొరికిన నానోటైరనస్ అస్థిపంజరాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ శిలాజాన్ని 2019లో మోంటానాకు సంబంధించిన ఓ రైతుకు జోడీ పియర్సన్ లభించిందట.. అందుకే ఆయన పేరును దీనికి జోడీ అని నామకరణం చేశారట.. ఇందులో విశేషమేమిటంటే.. డైనోసార్ పుర్రెతో సహా దాదాపు 191 ఎముకల శకలాలు చాలా స్పష్టంగా.. సహజంగా ఉండటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కోట్ల సంవత్సరాల నాటి ఈ అస్థిపంజరం ఇంతటి రికార్డు ధర పలకడం అంతర్జాతీయంగా చర్చనీశంగా మారింది..