• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో ..హైదరాబాద్ వాసి దుర్మరణం.. ఉమ్రా యాత్రలో తీరని విషాదం!

రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో ..హైదరాబాద్ వాసి దుర్మరణం.. ఉమ్రా యాత్రలో తీరని విషాదం!

Riyadh Airport Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక యాత్రికుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ అలీ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 12, 2026, 09:02 AM IST|Updated: Oct 12, 2026, 09:03 AM IST
joinshare
రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో ..హైదరాబాద్ వాసి దుర్మరణం.. ఉమ్రా యాత్రలో తీరని విషాదం!
Image Credit: Riyadh Airport Attack:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణలో ఎల్‌నినో దెబ్బ.. తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడి.. యాసంగి పంటలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

తెలంగాణలో ఎల్‌నినో దెబ్బ.. తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడి.. యాసంగి పంటలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

2

అక్టోబర్‌లో రెండుసార్లు గజకేసరి యోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బిగ్‌ జాక్‌పాట్!

3

నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? ఈ ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

4

అక్టోబర్‌లో ఒకే రోజు 4 శక్తివంతమైన రాజయోగాలు.. ఈ 3 రాశులవారికి అదృష్టం కలిసొస్తుందా?

5

ఆడపిల్లలే కాదు.. మగపిల్లలూ బాధితులే.. బాలురపై లైంగిక వేధింపుల ముప్పు.. కలవరపెడుతున్న షాకింగ్ నిజాలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Riyadh Airport Attack:  సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని  కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక యాత్రికుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ అలీ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 
పవిత్ర ఉమ్రా యాత్ర నిమిత్తం తన కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిన సమయంలో ఈ ఊహించని ధాటి చోటుచేసుకుంది.

శనివారం జరిగిన ఈ దాడిలో యూసుఫ్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. రియాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు కుమారులతోపాటు అత్త కూడా గాయాలపాలయ్యారు. ఒక కుమారుడికి మోకాలి శస్త్రచికిత్స జరిగింది. మరో కుమారుడి కాలి వేళ్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. అత్త తలకు గాయాలైనా ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. యూసుఫ్ అలీ భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మదీనా వెళ్లేందుకు చెక్ ఇన్ కియోస్క్ దగ్గర వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో ఈ ఘటనను ధృవీకరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాను బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నానని, వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందిస్తూ, మంత్రి జైశంకర్ మృతుని కుటుంబానికి సంతాపం తెలిపి, సాధ్యమైన అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. యూసుఫ్ అలీ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

హౌతీ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మొత్తం 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా, సౌదీ అరేబియాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Telugu News