Navratri Fasting: దసరా నవరాత్రుల వేళ ఉపవాస దీక్షలు ఆచరించేటప్పుడు శరీరానికి ద్రవాహారం చాలా ముఖ్యం. ఉపవాస సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రోజంతా తగినంత నీరు తాగడంతో పాటు, శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని అందించే సహజసిద్ధమైన పానీయాలైన కొబ్బరిబోండాలు, పలచని మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలను క్రమం తప్పకుండా తీసుకోవడం శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యంలో ఉంచి, నీరసం, అలసట రాకుండా కాపాడుతాయి.
రోజంతా పూర్తిగా పస్తులు ఉండాల్సిన అవసరం లేకుండా పండ్లు, డ్రైఫ్రూట్స్, సగ్గుబియ్యం, రాగి జావ, ఫుల్ మఖానా వంటి తేలికపాటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి జీర్ణశక్తికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
అదే సమయంలో ఆరోగ్యానికి హానీ చేసే డీఫ్ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా.. నూనెలో వేయించిన వంటకాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండాలి. ఉపవాస దీక్షను ముగించేటప్పుడు.. ఒక్కసారిగా భారీగా..లేదా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు.
మొదట ఫ్రూట్ జ్యూస్ తో ప్రారంభించి.. ఆ తర్వాత మితంగా ఆహారాన్ని తీసుకుంటే.. జీర్ణవ్యవస్థపై వెంటనే భారంగా పడకుండా ఉంటుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు అలాగే గర్భిణీలు కఠినమైన ఉపవాస దీక్షలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.