SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రపంచంలోనే తొలి AI సిటీ ఇదే.. డ్రైవర్‌లెస్ కార్లు, డ్రోన్లతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడుందో తెలుసా?

AI City: ప్రపంచంలో ఏఐ సిటీ ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ రోడ్లపై డ్రైవర్లు లేకుండానే కార్లు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్‌ డెలివరీ డ్రోన్స్‌తో చేస్తారు. ఇలా ఈ నగరం టెక్నాలజీలో ముందు ఉంది. అయితే, ఇది ఏ దేశంలో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 12:13 IST | Updated: Nov 20, 2026, 12:14 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

AI City News: ప్రపంచ దేశాలన్నీ సాంకేతికత వైపు పరుగులు పెడుతుంటే.. చైనాలోని ఒక నగరం మాత్రం కాలంతో పోటీ పడుతూ 2026లోనే ఏకంగా 2050 ఏళ్ల ఫ్యూచర్‌లో జీవిస్తూ వస్తోంది.. అదే చైనాలో ఉన్న షెన్‌జెన్.. ఇటీవల నవంబర్ 18, 19 తేదీల్లో ఇక్కడ జరిగిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సదస్సుతో ఈ నగరం మరోసారి ప్రపంచం దృష్టిని ఆకరిస్తూ వచ్చింది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి అగ్రనేతల కీలక భేటీలకు ఈ నగరం ఒక అద్భుతమైన వేదికగా మారింది.. ముఖ్యంగా షెన్‌జెన్‌లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కావడం.. అసలు ఈ నగరంలో అంత ప్రత్యేకత ఏముందన్న చర్చ అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమైంది..

షెన్‌జెన్ సిటీ అందాలు మాములుగా ఉండవు.. గతంలో  బావోఆన్ అనే పేరుతో పిలిచిన ఈ ప్రాంతం.. కేవలం మత్స్యకారులు మాత్రమే ఇక్కడ జీవించేవారు.. అయితే, 1979లో అప్పటి చైనా అధినేత డెంగ్ జియావోపింగ్ ఈ ప్రాంతాన్ని దేశంలోనే తొలి  ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించడంతో దీని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయట.. స్వేచ్ఛాతో పాటు వాణిజ్యానికి క్లియరెన్స్‌ రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ న్యూయార్క్ నగరాన్ని తలదన్నే భవనాలు వెలిశాయట.. ప్రస్తుతం 1.8 కోట్లకు పైగా జనాభాతో.. ప్రపంచంలోనే ఐదవ అత్యంత ఎత్తైన భవనం  పింగ్ ఆన్ ఫైనాన్స్ సెంటర్‌కు నిలయంగా ఈ మహా నగరం అవతరించిందట..

ప్రస్తుతం చైనా ప్రజలు షెన్‌జెన్‌ను ముద్దుగా ఏఐ సిటీ అని పిలుచుకుంటారట.. ఇక్కడి వీధుల్లో అడుగుపెడితే.. మనం ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోకి వచ్చామా అన్నట్లు ఉంటుందట.. రోడ్లపై డ్రైవర్లు లేకుండానే.. రోబో ట్యాక్సీలు, ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తాయట.. అంతేకాకుండా మనం ఆర్డర్ చేసిన వేడివేడి ఆహారంతో పాటు కాఫీ లేదా జ్యూస్‌లను మనుషులు కాకుండా ఆకాశంలో ఎగురుతూ వచ్చే డ్రోన్లు నేరుగా మన చేతికి అందిస్తాయట..

కేవలం సాంకేతికతలోనే కాకుండా.. సంపద సృష్టిలోనూ షెన్‌జెన్ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోందట.. గతేడాది 3.87 ట్రిలియన్ యువాన్ల జీడీపీతో షాంఘై, బీజింగ్ తర్వాత చైనాలో మూడో అత్యంత సంపన్న నగరంగా కూడా నిలవడం విశేషం.. పక్కనే ఉన్న హాంకాంగ్‌తో పోటీపడుతూ... ప్రపంచ టెక్నాలజీతో పాటు ఆర్థిక రంగాలకు కొత్త దిశను చూపుతూ షెన్‌జెన్ ముందుకు సాగుతూ వస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES