• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Smith Machar UAE Honor: భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ఘన సత్కారం..మెడల్ ఇచ్చి సత్కరించిన దుబాయ్ యువరాజు!

Smith Machar UAE Honor: భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ఘన సత్కారం..మెడల్ ఇచ్చి సత్కరించిన దుబాయ్ యువరాజు!

Capt Smith Machar UAE Honor: విమానంలో ఏర్పడిన తీవ్ర అత్యవసర పరిస్థితిలో అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబాయ్ సిబ్బందిని యూఏఈ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. విపత్కర పరిస్థితుల్లో వారు కనబరిచిన సమర్థవంతమైన వృత్తి నైపుణ్యానికి గుర్తింపుగా 'ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' అవార్డును ప్రదానం చేసింది.

Written ByHarish Darla
Published: Oct 28, 2026, 04:43 PM IST|Updated: Oct 28, 2026, 04:51 PM IST
joinshare
Smith Machar UAE Honor: భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ఘన సత్కారం..మెడల్ ఇచ్చి సత్కరించిన దుబాయ్ యువరాజు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

2

SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ తప్పులు చేస్తే భారీగా బాదుడే..!!

3

IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

4

కొత్త నిర్మాతలకు అండగా మెగాబ్రదర్.. ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ చేసిన నాగబాబు..

5

High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Capt Smith Machar UAE Honor: విమాన ప్రయాణికుల ప్రాణాలను కాపాడి అసాధారణ సాహసాన్ని ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వారి వృత్తిపరమైన బాధ్యతాయుత వైఖరి, అసమాన ప్రతిభకు గుర్తింపుగా గౌరవప్రదమైన 'ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' పురస్కారాన్ని అందజేసింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రధాన పురస్కారాలను అందజేశారు.

దీనికి ముందు, యూఏఈ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ సమక్షంలో విమాన సిబ్బందిని ప్రత్యేకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. తమ దేశంలో ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, సిబ్బంది ప్రదర్శించిన ధైర్యం ఎంతో ప్రశంసనీయమని యూఏఈ అత్యున్నత నాయకత్వం కొనియాడింది.

విమానంలో ఏం జరిగింది?
గత సెప్టెంబర్ 30వ తేదీన ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఊహించని అత్యవసర పరిస్థితి ఎదురైంది. కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఒక ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఎంతమాత్రం ధైర్యం కోల్పోకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాక్‌పిట్ డోర్‌ను తెరవగలిగారు.

కెప్టెన్ స్మిత్ తక్షణమే స్పందించడంతో, విమాన సిబ్బంది, ప్రయాణికులు కూడా వెంటనే సహాయక చర్యలకు పూనుకున్నారు. దీంతో సంభవించాల్సిన ఒక పెద్ద విపత్తు సమర్థవంతంగా నివారించారు. ఈ వీరోచిత చర్యతో కెప్టెన్ స్మిత్ ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరోగా ప్రసిద్ధి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ..
కెప్టెన్ స్మిత్ కనబరిచిన నిరుపమాన ధైర్యసాహసాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను హీరోగా కొనియాడగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన సాహసాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ కాక్‌పిట్ డోర్ తెరచి ప్రయాణికులను కాపాడినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిత్‌ను ప్రశంసించారు.

మరోవైపు, గాయాల నుంచి కోలుకున్న తర్వాత స్మిత్‌కు గౌరవప్రదమైన 'పౌర ధైర్యసాహస పురస్కారం' అందిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఆసుపత్రిలో పరామర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
అంతకుముందు అక్టోబర్ 3న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, విపత్కర వేళ ఆయన ప్రదర్శించిన ధైర్యాన్ని, బాధ్యతాయుత ప్రవర్తనను కొనియాడారు. మానవ ప్రాణాల పట్ల అత్యున్నత శ్రద్ధ, సాహసాన్ని స్మిత్ ప్రదర్శించారని, తమ దేశ నాయకత్వం తరఫున ఆయనకు పూర్తి అభినందనలు తెలుపుతున్నామని షేక్ హమ్దాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News