• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

India Predicted Playing XI: కివీస్ గడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న శ్రేయస్ సేన.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్‌కు భారత్ తుది జట్టు ఎలా ఉండనుంది..? ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది..?

Written ByAshok Krindinti
Published: Oct 29, 2026, 06:11 PM IST|Updated: Oct 29, 2026, 06:13 PM IST
joinshare
IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!
Image Credit: India Predicted Playing XI (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

2

SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ తప్పులు చేస్తే భారీగా బాదుడే..!!

3

IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

4

కొత్త నిర్మాతలకు అండగా మెగాబ్రదర్.. ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ చేసిన నాగబాబు..

5

High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India Predicted Playing XI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా నాలుగో టీ20 పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. సిరీస్ గెలవడంతో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే దిశగా కెప్టెన్, మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు, నాలుగో పోరులోనూ జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే సిరీస్ తేలిపోవడంతో రాబోయే మెగా టోర్నీలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు అవకాశం దక్కని ఆటగాళ్లను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా తొలి టీ20లో గాయపడి గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అతడిని నేరుగా తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయం.

ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తే టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారుతుంది. ఎలాగూ సిరీస్ గెలిచేశాం కాబట్టి.. సంజు శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చి అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీని కొనసాగించే ఛాన్స్ కూడా ఉంది. గత మ్యాచ్‌లో వీరిద్దరి విధ్వంసంతో 199 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయింది. అభిషేక్ శర్మ సెంచరీతో ఫామ్‌లో ఉండగా.. 45 పరుగులతో వైభవ్ సత్తాచాటాడు. ఒకవేళ ఇషాన్‌ను పూర్తిగా కోలుకునేంత వరకు ఆఖరి మ్యాచ్ వరకూ వేచి చూడాలనుకుంటే.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు.

ఇక బౌలింగ్ విభాగంలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఆక్లాండ్ స్టేడియం చిన్న బౌండరీలకు పెట్టింది పేరు. ఇక్కడ స్పిన్నర్ల నియంత్రణ ఎంతో ముఖ్యం. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చి.. బెంచ్‌కే పరిమితమైన చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ లేదా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీలో ధారళంగా పరుగులు సమర్పించినా.. తుది జట్టులో అవకాశం దక్కనుంది. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి కంటిన్యూ కానున్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పేసర్ల రొటేషన్ ఉండే వీలుంది.

భారత్ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, కుల్‌దీప్ యాదవ్/అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
BCCI