SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాకు లిప్‌లాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

King Cobra Video: అత్యంత ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాకు లిప్‌లాక్‌ పెట్టిన ఓ యువకుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 04:15 PM IST | Updated: Sep 29, 2026, 04:18 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

King Cobra kiss video: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్‌ కోబ్రా మొదటి వరసలో ఉంటాయని మనందరికీ తెలుసు.. ఈ పాము కాటు ఎంత ప్రమాదకమరమంటే... కొద్ది నిమిషాల్లోనే ఏనుగును సైతం చంపే అత్యంత శక్తివంతమైన విషాన్ని కలిగి ఉంటుంది. అలాంటి భయంకరమైన కింగ్‌కోబ్రా ఎదురుపడితే అందరూ కొంత దూరం వరకు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మృత్యువుతోనే చెలగాటమాడుతున్నాడు. కసిగా పడగ విప్పి.. బుసలు కొడుతున్న కింగ్‌ కోబ్రాకు ఏమాత్రం భయపడకుండా.. ముద్దు పెట్టి.. అందిరినీ ఆశ్చర్యపరిచాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ స్నేక్‌ క్యాచర్‌ దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడవున్న భారీ కింగ్‌ కోబ్రా రక్షించేందుకు వెళ్లాడు.. ఆ పాము ఎంతో ఆగ్రహంతో, పగడ పూర్తిగా పైకి లేపి.. ఎవరినైనా కాటేయడానికి సిద్ధంగా ఎదురుచూస్తోంది.. ఆ సమయంలో స్నేక్‌ క్యాచర్‌ ఏమాత్రం తొందర పడకుండా.. పాము దృష్టిని మళ్లించాడు. ఆనంతరం నెమ్మదిగా పాము తల వెనుక భాగానికి తన ముఖాన్ని చేర్చి.. దాని పడగ వెనుక భాగంపై ఒక్కసారిగా ముద్దు పెట్టుకోవడం మీరు గమనించవచ్చు.

ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు గుండెలు ఒక్కసారిగా ఝల్లుమంటున్నాయి. ఏమాత్రం తప్పినా లేదా పాము ఎంతో సింపుల్‌గా వెనక్కి తిరిగి కాటేసినా.. అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉండేది.. అలాంటి పరిస్థితిలోనూ ఆ వ్యక్తి చేసిన మ్యాజిక్‌కు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి లక్షలాది వ్యూస్‌తో పాటు లైకులు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. ఇది ధైర్యం కాదు.. పిచ్చితనం.. ప్రాణాలతో ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయకూడదని కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. అతని నైపుణ్యానికి హ్యాట్సాఫ్.. కానీ రీల్స్.. వ్యూస్ కోసం ఇలాంటివి చేసి ఇతరులను ప్రమాదంలోకి నెట్టొద్దని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రెండ్‌ అవుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES