SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

Student Protests: పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి.. ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ.. ఫ్రాన్స్ లోని విద్యార్థులు చేపట్టిన భారీ ఆందోళనతో ఆ దేశం అట్టుడుకుతోంది. 15 నుంచి 18ఏళ్ల వయస్సున్న ఉన్నత పాఠశాల విద్యార్థులు వేలాదిగా వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతుండటంతో.. ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 08, 2026, 09:07 AM IST | Updated: Oct 08, 2026, 09:09 AM IST
Image Credit: Student Protests
Join

Student Protests: పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి.. ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ.. ఫ్రాన్స్ లోని విద్యార్థులు చేపట్టిన భారీ ఆందోళనతో ఆ దేశం అట్టుడుకుతోంది. 15 నుంచి 18ఏళ్ల వయస్సున్న ఉన్నత పాఠశాల విద్యార్థులు వేలాదిగా వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతుండటంతో.. ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్స్ ద్వారా వేగంగా వ్యాపించిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారింది.

గతనెల 21న పారిస్ సమీపంలోని ఓ స్కూళ్లో టీచర్ల కొరతను నిరసిస్తూ.. టీచర్లు చేపట్టిన ధర్నాకు విద్యార్థులు మద్దతు పలికారు. దీంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. ప్రభుత్వం తాత్కాలికంగా ఆ పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను కేటాయించినా.. దేశంలోని ఇతర హైస్కూల్లో విద్యార్థులు కూడా తమ సమస్యలపై గళం విప్పారు. బడుల్లో సరైన వసతులు లేకపోవడం.. తరగతి గదుల్లో పరిమితికి మంచి విద్యార్థుల సంఖ్య ఉండటం.. ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించాలన్న ప్రభుత్వ ఆలోచన వంటివి ఆ విద్యార్థుల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి.

ప్రశాంతంగా మొదలైన ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. పలు చోట్ల స్కూల్ భవనాలకు నిప్పు పెట్టారు. ఇప్పటి వరకు సుమారు వంద స్కూల్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు దాదాపు 6వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 87శాతం మంది విద్యార్థులే ఉన్నారని మాక్రాన్ ప్రభుత్వం పేర్కొంది. పోలీసులు గ్రెనేడ్ దాడిలో ఓ విద్యార్థి చేయి కోల్పోవడం అక్కడి పరిస్థితి అద్దం పడుతోంది.

ఈ ఉద్యోమంలోకి క్రమంగా వామపక్షపార్టీలు, కార్మిక సంఘాలు, రైతులు కూడా వచ్చారు. ఇది విద్యార్థుల ఉద్యమం కాదని.. ప్రతిపక్షాల రాజకీయ కుట్రని ప్రధాని సెబాస్టియన్ లీకార్ను ఆరోపించారు. మరోవైపు ఈ హింసను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల డిమాండ్లను వినాలను అధికారులను కూడా ఆదేశించారు. వచ్చే ఏడాది దేశంలో అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పాలి. 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES