• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /మణిపూర్ నుంచి సోమాలియా వరకు.. 101 గంటల్లో ప్రయాణం పూర్తి చేసిన చిన్న పక్షి గురించి తెలుసా?

మణిపూర్ నుంచి సోమాలియా వరకు.. 101 గంటల్లో ప్రయాణం పూర్తి చేసిన చిన్న పక్షి గురించి తెలుసా?

Alang Falcon Viral News: అలాంగ్ పక్షి గురించి ఎంతమందికి తెలుసు? ఇది అత్యంత వేగవంతంగా ప్రయాణం చేసే వాటిల్లో ఒకటి. అయితే, అనేక వాతావరణ పరిస్థితులు ఎదుర్కొని ఏకంగా 5700 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 101 గంటల్లో మాత్రమే చేరుకోగలిగింది. ఈ పక్షికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 12:11 IST|Updated: Nov 22, 2026, 12:12 IST
joinshare
మణిపూర్ నుంచి సోమాలియా వరకు.. 101 గంటల్లో ప్రయాణం పూర్తి చేసిన చిన్న పక్షి గురించి తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Alang Falcon Viral News: ప్రకృతి ఒడిలో వింతలు విశేషాలకు అస్సలు కొదవ ఉండదు. అందులోనూ వలస పక్షుల ప్రయాణానికి సంబంధించిన సామర్థ్యం ఎప్పుడు శాస్త్రవేత్తలతో పాటు పక్షుల ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. తాజాగా అటువంటి ఓ అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం అరచేతి అంత సైజు ఉండే చిన్న అలంగ్ అని ఫాల్కన్ జాతికి చెందిన పక్షి.. తన శరీర పరిణామానికి మించిన సాహసాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు ఈ పక్షి ఏం చేసింది? సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి బయలుదేరిన ఈ అలాంగ్ పక్షి.. ఆఫ్రికా ఖండంలోని సోమాలియా దేశానికి చేరుకుంటుందట.. ఈ క్రమంలో ఇది ఏకంగా 5700 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కేవలం 101 గంటల్లో మాత్రమే చేరుకోవడం విశేషం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. . ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగదట. విశ్రాంతి తీసుకోకుండానే.. ఆహారం కోసం ఒక్క క్షణం నేలపై వాలకుండానే.. విశాలవంతమైన అరేబియా సముద్రాన్ని సైతం దాటుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకుంటుందట..

ఈ ప్రయాణాన్ని పూర్తిచేసిన అలాంగ్ పక్షి బరువు కేవలం 150 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం. ఇంత తక్కువ బరువు ఉన్న ఒక చిన్న జీవి, ఎంతో ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులతో పాటు సముద్రపు గాలులను తట్టుకుంటూ నాలుగు రోజులకు పైగా నిరంతరం రెక్కలు ఆడిస్తూ ప్రయాణించడం ప్రకృతి అద్భుతాలలో ఒకటిగా నిపుణులు అభివర్ణిస్తూ వస్తున్నారు . ఇలాంటి సాహసాలు చేసే పక్షులు ఇప్పటివరకు ఎక్కడా లేవని చెబుతూ వస్తున్నారు..

వలస పక్షుల జీవన విధానంతో పాటు వాటి ప్రయాణ మార్గాలపై లోతనే పరిశోధన చేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఈ అరుదైన రికార్డును నమోదు చేశారట.. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అలాంగ్ తో పాటు అపపాంగ్ అనే మరో పక్షికి కూడా అత్యాధునిక సాటిలైట్ ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. వీటి ద్వారా ఆ పక్షుల కదలికలతో పాటు వేగవంతాన్ని, అవి ప్రయాణించే దిశలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..

ఈ ట్రాకింగ్ డేటా ద్వారా వలస పక్షులు ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. మణిపూర్ వంటి ప్రాంతాల్లో స్థానిక, అటవీశాఖ అధికారులు ఈ పక్షుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యాల ఫలితంగానే ఈరోజు ఇటువంటి అద్భుతమైన ప్రయాణాలు సాధ్యమవుతున్నాయని పర్యావరణ వెత్తలు హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిజంగానే పిట్ట కొంచెం ప్రయాణం గణం అనే నానుడికి ఈ పక్షి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News