• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Trump Putin Meeting: ఒకే వేదికపైకి పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్..చైనాలో అగ్రరాజ్యాల అధినేతల అరుదైన కలయిక!

Trump Putin Meeting: ఒకే వేదికపైకి పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్..చైనాలో అగ్రరాజ్యాల అధినేతల అరుదైన కలయిక!

Trump Putin XI Jinping Meeting: చైనాలోని షెంజెన్ వేదికగా జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఎపెక్) సదస్సు సందర్భంగా ప్రపంచ అగ్రరాజ్యాల అధినేతలు ఒకే వేదికపై ప్రత్యక్షమై సరికొత్త చరిత్ర సృష్టించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇచ్చిన విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు.

Written ByHarish Darla
Published: Nov 19, 2026, 08:18 IST|Updated: Nov 19, 2026, 08:21 IST
joinshare
Trump Putin Meeting: ఒకే వేదికపైకి పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్..చైనాలో అగ్రరాజ్యాల అధినేతల అరుదైన కలయిక!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Trump Putin XI Jinping Meeting: చైనాలోని షెంజెన్ నగరంలో బుధవారం సాయంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎపెక్ సదస్సుకు హాజరైన దేశాధినేతల గౌరవార్థం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. హాలులో ట్రంప్, జిన్‌పింగ్ ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వారి వద్దకు చేరుకున్నారు.

ఆ సమయంలో ట్రంప్, పుతిన్ కరచాలనం చేసుకుని, ఒకరి భుజం మరొకరు తట్టుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భాన్ని జిన్‌పింగ్ ఆసక్తిగా గమనించగా, అనంతరం ముగ్గురు నేతలు కలసి ఉల్లాసంగా గడుపుతూ ఫొటోలు దిగారు, చర్చలు కొనసాగించారు.

నేతల భేటీలు - చారిత్రక నేపథ్యం
2025 ఆగస్టులో అలస్కా వేదికగా జరిగిన సమావేశం తర్వాత ట్రంప్, పుతిన్‌లు మళ్లీ కలుసుకోవడం ఇదే ప్రథమం. కాగా, దేశాధినేతల హోదాలో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ కావడం ఇది 50వ సారి కావడం విశేషం. అంతకుముందే షెంజెన్ చేరుకున్న పుతిన్, జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమై తమ విదేశాంగ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విచ్చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు జిన్‌పింగ్ వ్యక్తిగతంగా విమానాశ్రయానికి వెళ్లి ఆలింగనం చేసుకుని సైనిక వందనం, ఫైటర్ జెట్ల విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు.

కీలక చర్చలు, అంతర్జాతీయ ప్రాధాన్యం
ట్రంప్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపి ఇరుదేశాల సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు ఆసియా-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వాలకు సహకరించుకోవాలని చైనా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ సైతం జిన్‌పింగ్‌తో భేటీ ఆశాజనకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం జరగనున్న విస్తృత, ద్వైపాక్షిక భేటీల్లో అణ్వాయుధ నియంత్రణ, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిణామాలపై నేతలు చర్చించే అవకాశముంది. అంతేకాకుండా, ఈ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో కూడా సమావేశం కావాలని ట్రంప్ యోచిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Donald Trump
Telugu News