• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Underwater Gold Mines: సముద్ర గర్భంలో భారీ బంగారం నిల్వలు.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..ఎక్కడంటే?

Underwater Gold Mines: సముద్ర గర్భంలో భారీ బంగారం నిల్వలు.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..ఎక్కడంటే?

Chinese Underwater Gold Mines: పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర గర్భంలో చైనా శాస్త్రవేత్తల బృందం ఒక భారీ హైడ్రోథర్మల్ క్షేత్రాన్ని కనుగొంది. భూమిపై ఉండే సాధారణ ఖనిజ నిక్షేపాల కంటే ఈ సముద్రగర్భ నమూనాల్లో బంగారం, వెండి సాంద్రతలు అత్యంత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు ధృవీకరించారు. 'జియాంగ్ యాంగ్ హాంగ్ 10' పరిశోధనా నౌక ద్వారా చేపట్టిన ఈ యాత్రలో పాలిమెటాలిక్ సల్ఫైడ్ నిక్షేపాలు, అరుదైన శంకు ఆకారపు నిర్మాణాలు వెలుగుచూశాయి.

Written ByHarish Darla
Published: Sep 13, 2026, 04:00 PM IST|Updated: Sep 13, 2026, 04:04 PM IST
joinshare
Underwater Gold Mines: సముద్ర గర్భంలో భారీ బంగారం నిల్వలు.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..ఎక్కడంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chinese Underwater Gold Mines: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రపు అడుగుభాగంలో ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక భారీ క్రియాశీలక, అధిక-ఉష్ణోగ్రత హైడ్రోథర్మల్ క్షేత్రాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ సీజీటీఎన్ అందించిన కథనం ప్రకారం.. సింఘువా విశ్వవిద్యాలయం, క్వింగ్‌డావో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ జియాలజీ, షాంఘై జియావోటాంగ్ విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు ఈ అన్వేషణలో భాగస్వాములయ్యారు. చైనా తమ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వయంగా తయారు చేసిన అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఈ నూతన క్షేత్రాన్ని విజయవంతంగా గుర్తించింది.

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం 'జియాంగ్ యాంగ్ హాంగ్ 10' అనే పరిశోధనా నౌకలో షెన్‌జెన్ నగరం నుండి ఆగస్టు 10న బయలుదేరి 18 రోజుల పాటు సుదీర్ఘ సముద్రయానం నిర్వహించింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోని ఒక బ్యాక్-ఆర్క్ బేసిన్ ప్రాంతంలో మొత్తం ఏడు విడతల సర్వేలు పూర్తి చేశారు.

నిజానికి ఈ తాజా యాత్రకు ముందే పరిశోధకులు 10 కంటే ఎక్కువ ప్రాథమిక సర్వేలు నిర్వహించి, సముద్ర ఉపరితలం నుండి 700 నుండి 1,500 మీటర్ల లోతులో డజన్ల కొద్దీ హైడ్రోథర్మల్ వెంట్‌లను గుర్తించారు. ఈ బిలాల నుండి వెలువడుతున్న ద్రవాల ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్‌ను మించి నమోదవ్వడం గమనార్హం.

సముద్రపు అడుగుభాగంలో సేకరించిన ప్రాథమిక నమూనాల విశ్లేషణ ప్రకారం.. ఈ ప్రాంతంలో విస్తారమైన పాలిమెటాలిక్ సల్ఫైడ్ ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా సాధారణ భూభాగంలో దొరికే ఖనిజ నిక్షేపాల కంటే ఇక్కడ బంగారం, వెండి సగటు సాంద్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధనల సమయంలో సముద్రపు అడుగుభాగంలో మూడు పెద్ద శంకు ఆకారపు అరుదైన నిర్మాణాలు వెలుగు చూశాయి.

నౌకలోని ప్రయోగశాలలో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో ఈ ధాతువు ప్రధానంగా చాల్కోపైరైట్, పైరైట్, స్ఫాలరైట్‌లతో కూడుకున్నట్లు ధృవీకరించబడింది. ఆర్థికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఖనిజాలతో పాటు భారీగా లభ్యమవుతున్న బంగారం, వెండి ఆనవాళ్లు రాబోయే రోజుల్లో ప్రపంచ సముద్రగర్భ ఖనిజ వేటలో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నాయి.

(గమనిక: ఈ కథనంలో ప్రచురించిన వార్త కేవలం కొన్ని జాతీయ సంస్థల నివేదికల ఆధారంగా పేర్కొన్నది. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. అలాగే ఎలాంటి పెట్టుబడులు లేదా బంగారానికి సంబంధించిన ఇతర వ్యాపకాలను పోత్సహించడమూ లేదు.) 

Also REad: ఇరాన్‌తో భీకర యుద్ధం వేళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?

Also REad: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం..209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source