SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో టైటానిక్ తరహా పడవ ప్రమాదం..

Titanic Type Ship Coolision: టైటానిక్ సినిమా మాత్రమే కాదు.. చరిత్రలో జరిగిన అతిపెద్ద మునిగిపోయిన ఓడ. ఈ ఓడ ఎలా మునిగిందో ఎక్కడో ఉందో ఇప్పటికీ ఓ మిస్టరీనే. దానిపై సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో టైటానిక్ తరహా పడవ ప్రమాదం చోటు చేసుకుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 11:47 AM IST | Updated: Nov 14, 2026, 02:51 PM IST
Image Credit: Titanic Ship (ZEE News Telugu/Source)
Join

Ship Accident: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో టైటానిక్ తరహా పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పోర్ట్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ సమీపంలోని మిస్సిస్సిప్పి నదిలో భారీ నౌక ప్రమాదం జరిగిన ఘటనలకు సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

నది ఒడ్డున నిలిపి ఉంచిన రివర్ క్రూయిజ్ నౌకను బలంగా ఢీకొట్టింది.. 

అదుపుతప్పిన ఒక ఆయిల్ ట్యాంకర్ నౌక, నది ఒడ్డున నిలిపి ఉంచిన రివర్ క్రూయిజ్ నౌకను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే ట్యాంకర్ నౌక, అమెరికన్ క్రూయిజ్ లైన్స్ సంస్థకు చెందిన అమెరికన్ హెరిటేజ్ క్రూయిజ్ నౌకను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో సుమారు 190 మంది ప్రయాణికులు..

ప్రమాదం జరిగిన సమయంలో క్రూయిజ్ నౌకలో సుమారు 190 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్రయాణికులతో సహా ఆ పడవ మునిగిపోయింది. ఇది గమణించిన రెస్క్యూ సిబ్బంది పడవలోని ప్రయాణికులందరిని రక్షించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన 32 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. యితే, అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయ స్థితి, తీవ్రమైన గాయాలు కాలేదని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్పష్టం చేశారు. ట్యాంకర్ అదుపు తప్పడానికి గల సాంకేతిక కారణాలపై అమెరికా కోస్ట్ గార్డ్, పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES