SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పాముల కోసం ఏడాదిలో 4 నెలలు రోడ్డు మూసేస్తారు.. ఎక్కడుందో తెలుసా?

Snake Road News: ఈ ప్రాంతంలో కేవలం పాముల కోసం రోడ్డును నాలుగు నెలల పాటు మూసేస్తూ ఉంటారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమెరికా అటవీ శాఖ ఏటా రెండు విడతల్లో ఈ రోడ్డును మూసేస్తుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 14:37 IST | Updated: Nov 19, 2026, 14:39 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Snake Road Viral News: సాధారణంగా హైవేలు అంటేనే ప్రతి రోజు కార్లతో పాటు ట్రక్కులు, ఇతర వాహనాలతో రద్దీతో, మనుషుల సంచారంతో కిటకిటలాడుతుంటాయి.. కానీ, కేవలం పాములతో పాటు ఇతర వన్యప్రాణుల కోసం ఏడాదిలో నాలుగు నెలల పాటు ఒక రహదారిని పూర్తిగా మూసివేస్తారంటే మీరు నమ్ముతారా? మీరు తప్పకుండా నమ్మాల్సిందే.. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఇలాంటి ఒక వింత రహదారి ఉంది.. వన్యప్రాణుల కోసం అక్కడి అధికారులు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ రోడ్డు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షానీ నేషనల్ ఫారెస్ట్ గుండా ఒక రోడ్డు వెళ్తుంది.. అధికారికంగా దీనిని ఫారెస్ట్ సర్వీస్ రోడ్ 345 అని.. స్థానికంగా లా రూ రోడ్ అని పిలుస్తూ ఉంటారని అధికారులు తెలుపుతున్నారు. అయితే, ఏడాదిలో కొన్ని నెలల పాటు ఈ రొడ్డు గుండా వందలాది పాములు వెళ్లడంతో దీనికి  స్నేక్ రోడ్ అనే పేరు స్థిరపడిపోయిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండే.. ఈ రొడ్డుకి ఒకవైపు సున్నపురాయి కొండలతో పాటు మరోవైపు చిత్తడి నేలలు ఉంటాయి.. ఈ ప్రాంతం అనేక రకాల పాములతో పాటు చిన్న చిన్న జీవులకు ప్రధాన ఆవాసంగా నిలుస్తూ వస్తోంది..

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని పాములతో పాటు ఇతర వన్యప్రాణులు ఏడాదికి రెండుసార్లు తమ నివాసాలను మార్చుకుంటూ ఉంటాయట.. వేసవి సమయంలో చల్లదనం కోసం ఇవి చిత్తడి నేలల ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతూ ఉన్నారు. చలికాలం స్టార్ట్‌ అవ్వడంతో వెచ్చదనంతో పాటు రక్షణ కోసం సున్నపురాయి కొండల పైకి వలస వెళ్తూ.. తిరిగి వేసవి రాగానే కొండల పైనుంచి చిత్తడి నేలల వైపు వెళ్తాయని స్థానికలు తెలుపుతున్నారు.

ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఈ రహదారి ఉంటుందట.. దాంతో వలస సమయంలో వందలాది పాములు ఒకేసారి ఈ రోడ్డును దాటుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో వాహనాలను అనుమతిస్తే.. అవి చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. అంతేకాకుండా రోడ్డు నిండా పాములు ఉండటం వల్ల ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతుందని సమాచారం. ఈ కారణంతో అమెరికా అటవీ శాఖ ఏటా రెండు విడతల్లో ఈ రోడ్డును మూసివేస్తుంది. మొదటి విడతలో భాగంగా మార్చి 15 నుంచి మే 15 వరకు.. రెండో విడతలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ రోడ్డును మూసేస్తూ ఉంటారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES