చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
World Students Day 2026: విద్యార్థులంటే పాఠశాల లేదా కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించేవారే కాదు.. ప్రతి మనిషి రోజు ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అనేది సహజం. అందుకే మనమంతా నిత్య విద్యార్థులమే.
World Students Day 2026: విద్యార్థులంటే పాఠశాల లేదా కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించేవారే కాదు.. ప్రతి మనిషి రోజు ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అనేది సహజం. అందుకే మనమంతా నిత్య విద్యార్థులమే. మనిషి నిజమైన వ్యక్తిగా ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకంగా ఉంటుంది. జీవితంలో విద్యార్థి దశ గొప్పతనాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 17వ తేదీన అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థుల హక్కులను కాపాడటం.. వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యమని చెప్పాలి.
విద్యార్థి జీవితం:
విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన.. ఉత్తేజకరమైన సమయం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం.. అన్వేషించడం ద్వారా జ్నానాన్ని డెవలప్ చేసుకుంటారు. ఆటపాటలతోపాటు కొత్త స్నేహాలతో సాగే ఆ ప్రయాణం ఎప్పటికీ ఒక మంచి జ్నాపకమే అని చెప్పాలి. సమయ నిర్వహణ, సమస్యా పరిష్కారం, క్రమశిక్షణ, గమ్యాన్ని చేరాలన్న పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. జీవిత నైపుణ్యాలను డెవలప్ చేసుకోవచ్చు. విద్యా సంబంధ పరీక్షల్లో మంచి గ్రేడ్ సంపాదించడం, సవాళ్లను ఎదుర్కోవడం మొదలైనవన్నీ విద్యార్థి దశలోనే చేసే కృషి అంకితభావానికి నిదర్శనం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం చారిత్రక నేపథ్యం:
1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయిన తర్వాత సామ్రాజ్య విస్తరణలో భాగంగా పొరుగు దేశాలను ఆక్రమించాలని ప్రయత్నించారు. 1938లో నాజీలు మొదట ఆస్ట్రియాను స్వాధీనం చేసుకున్నారు. 1939లో చెకోస్టోవియాను ఆక్రమించాలనే ప్లాన్ చేశారు. అదే ఏడాది నవంబర్ 17న హిట్లర్ సేనలు ప్రాక్ లోని చార్లెస్ యూనివర్సిటీలోకి ప్రవేశిస్తుండగా.. అందులోని అధ్యాపకులు, విద్యార్థులు వారిని అడ్డుకోవడంతో నాజీ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. 1200కి పైగా విద్యార్థులను నిర్బంధించింది. కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు.
ఈ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత 1941లో అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి లండన్ లో సమావేశం అయ్యింది. అందులో 1939 నాటి విద్యార్థుల బలిదానానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 17వ తేదీన అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా జరపాలని తీర్మానించారు. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు పాటించాల్సిన అధ్యయన ప్రణాళిక:
తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే ప్రతి సబ్జెక్టును పూర్తి ఏకాగ్రతతో ఆలకిస్తూ, విద్యార్థులు కొన్ని ముఖ్య నియమాలను పాటిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చు. అవగాహనతో కూడిన అభ్యసనం.. పాఠాలను యాంత్రికంగా బట్టీ పట్టకుండా, ప్రతి అంశం వెనుక ఉన్న మూల సూత్రాలను అర్థం చేసుకోవాలి. సందేహాలను వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. క్లాస్ వర్క్ పుస్తకంలో ముఖ్యమైన పాయింట్లను రాసుకొని, ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని సొంత మాటల్లో పునశ్చరణ ( చేసుకోవాలి. సెల్‌ఫోన్, అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్టుకు రోజువారీ టైమ్‌టేబుల్ ప్రకారం సమయం కేటాయించాలి. పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని మంచి పుస్తకాలు, దినపత్రికలు చదవడం ద్వారా భాషా నైపుణ్యం, ఆత్మవిశ్లేషణ శక్తి పెరుగుతాయి.
Also Read: