SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన ఆపిల్ సేవలు.. యూఎస్‌లో అసలేం జరుగుతోంది..

Apple Company Outage: అగ్ర రాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఏమైంది.. ? గత కొన్ని రోజులుగా అక్కడ జరగుతున్న పరిణామాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటి మొన్న విమాన సర్వీసులు నిలిచిపోవడం.. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఔట్ లుక్ సేవలకు అంతరాయం.. బ్యాంకుల్లో సేవలు నిలిచిపోవడం.. తాజాగా ఆపిల్ సేవలకు అంతరాయం కలగడం యాదృచ్చికమా.. లేకపోతే శత్రు దుర్బేద్యమని చెప్పుకునే అమెరికాపై ఎవరైనా సైబర్ ఎటాక్ చేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 12:27 IST | Updated: Nov 18, 2026, 13:30 IST
Image Credit: Apple Phone (ZEE News Telugu/Source)
Join

Will Cyber Attack on Apple: అమెరికా సహా పలు దేశాల్లో ఆపిల్ సేవలు నిలిచిపోవాయి. దీంతో లక్షలాది  మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆపిల్‌కు చెందిన ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే, ఆపిల్ సపోర్ట్ సేవల్లో టెక్నికల్‌ ఇష్యూ ఏర్పడింది.   దీంతో కస్టమర్స్ ఎవరు  తమ అకౌంట్స్‌లోకి లాగిన్ కాలేకపోయారు. సర్వీస్‌లో  సమస్యలను గుర్తించే డౌన్‌ డిటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఆపిల్ పే సేవలకు సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఐక్లౌడ్ సేవల్లోనూ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.  క్రమంగా యాప్ స్టోర్, ఆపిల్ సపోర్ట్ సహా ఇతర సేవలకూ ఈ అంతరాయం కలిగింది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్లే సమస్యలని తెలిపిన సంస్థ..
ఈ సందర్భంగా ఆపిల్ బిజినెస్ మేనేజర్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ స్టోర్, సైన్ ఇన్ విత్ ఆపిల్, ఆపిల్ కార్డ్ వంటి సేవల్లోనూ సమస్యలు వచ్చినట్టు తెలిపారు. ఆపిల్ అధికారిక సపోర్ట్ పేజీ సైతం ఐక్లౌడ్ ఖాతాలు, సైన్ ఇన్ ప్రక్రియతో పాటు యాప్ స్టోర్, ఆపిల్ మ్యూజిక్ సేవల్లో సమస్యలు ఉన్నట్లు సంస్థ గుర్తించింది.  

యునైటెడ్ ఎయిర్‌లైన్స్, మైక్రోసాఫ్ట్‌లోనూ సాంకేతిక లోపాలు..

పలువురు వినియోగదారులు తమ ఆపిల్ అకౌంట్స్ ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా  లాగ్ అవుట్ అయ్యామని, తిరిగి లాగిన్ కావడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. మరికొందరు కొత్త ఐఫోన్ల యాక్టివేషన్‌లోనూ సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ ఫెయిల్ అయిందనే ఆవేదన వ్యక్తం చేశారు.

సైబర్ దాడులు కావని స్పష్టం చేస్తున్న కంపెనీలు..
ఈ ఇష్యూ  అమెరికాకే పరిమితం కాలేదు. బ్రెజిల్, గ్రీస్, లాత్వియా దేశాల్లోనూ వినియోగదారులు సమస్యలున్నట్టు  తెలిపారు. ముఖ్యంగా ఆపిల్ పే పనిచేయడం లేదని తెలిపారు. ఖాతాలోకి సైన్ ఇన్ కావడం లేదని పలువురు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గత వారం రోజులుగా ప్రముఖ ఆన్‌లైన్ సేవలు వరుసగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్.. టీమ్స్ సేవలు 30 గంటలకు పైగా నిలిచిపోయాయి. నవంబర్ 13న అమెరికాలో టెక్నికల్ ఇష్యూస్  కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోయి వేలాది విమానాలపై ప్రభావం పడింది. సోమవారం జేపీ మోర్గాన్ చేజ్ వ్యవస్థల్లో సమస్యతో పలు అమెరికా బ్యాంకుల ఆన్‌లైన్ సేవలకూ అంతరాయం ఏర్పడింది. తాజాగా ఆపిల్ సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES