SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Oracle Layoffs: ఈ రోజే మీ ఆఖరి రోజు.. Oracle ఉద్యోగులకు భారీ షాక్‌!

Oracle ఉద్యోగులకు సంస్థ భారీ షాకింగ్‌ న్యూస్‌ను తెలిపింది. ఉదయం ఆరు గంటల సమయంలో లేఆఫ్స్‌ ఈ-మెయిల్ పంపించింది. అంతేకాకుండా కంప్యూటర్స్‌కి సంబంధించిన లాగిన్స్‌ కూడా తొలగించింది. దీంతో ఉద్యోగులు షాక్‌లో ఉన్నారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 15, 2026, 12:26 PM IST | Updated: Sep 21, 2026, 06:04 PM IST
Image Credit: Oracle Layoffs: ఈ రోజే మీ ఆఖరి రోజు.. Oracle ఉద్యోగులకు భారీ షాక్‌!
Join

Oracle Layoffs News: ప్రముఖ టెక్‌ దిగ్గజ కంపెనీ ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్‌ అందించింది. రోజులాగే పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న కొందరు ఉద్యోగులకు ఉదయాన్నే 6 గంటలకు కంపునీ నుంచి ఒక E-mail వచ్చింది. మీ ఉద్యోగానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తెలుపుతున్నమంటూ.. ఈ రోజే సంస్థలో మీకు చివరి రోజు.. అని వచ్చిన మెసేజ్‌ చేసి ఉద్యోగులంతా షాక్‌ అయిపోయారు. ఏంటని పూర్తి మెయిల్‌ను ఓపెన్‌ చేయగా.. అసలు విషయం ఏంటో బయపడింది.

క్షణాల్లో సిస్టమ్స్ లాగౌట్..
కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని.. వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని.. ఆ ఈ-మెయిల్‌లో వెల్లడించారు. అలాగే, నోటిస్‌ అందిన కొద్ది సమయంలో ఒరాకిల్‌ కంప్యూటర్లు, ఈ-మెయిల్స్, ఫైల్స్‌కి సంబంధించిన యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉద్యోగాలు తెలిపారు. సెవెరెన్స్ ప్యాకేజీతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవడానికి తప్పకుండా ఉద్యోగులు తమ పర్సనల్‌ ఈ-మెయిల్ ఐడీలను ఇవ్వాలని కోరారు. అయితే, ఈ లేఆఫ్స్‌లో భాగంగా ఎంతమందిని తొలగించారనే సంఖ్యను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

ఏఐ కోసం భారీ ఖర్చు.. 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్‌కి సంబంధించిన విస్తరణ కోసం ఒరాకిల్ భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెళ్లలో డేటా సెంటర్లతో పాటు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం దాదాపు 28.5 బిలియన్ డాలర్ల క్యాపెక్స్ ఖర్చు చేసిందని తెలుస్తోంది. అయితే, ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్న క్రమంలో కంపెనీపై క్యాష్‌ ఫ్లో భారం పెరిగింది. దీంతో ఒకవైపు AI అభివృద్ధికి పెట్టబడులు పెడుతుండగానే.. మరోవైపు వ్యయానికి సంబంధించిన భారాన్ని నియంత్రించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రణాళికలను అమలు చేస్తూ వస్తోంది..

21,000 మందిపై ఇప్పటికే ప్రభావం..
ఒరాకిల్ గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఖర్చులు దాదాపు 2.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.. కేవలం ఒరాకిల్ మాత్రమే కాకుండా ఉబర్‌తో పాటు పేపాల్, యాపిల్, జొమాటో వంటి పలు దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాల కోతలను చేపడుతున్నట్లు తెలుస్తోంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల IT, కస్టమర్ సపోర్ట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో సంస్థాగత మార్పులు వేగంగా జరుగుతున్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు..

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES