• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌
Live Now

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Heavy Rain In Hyderabad Live Updates: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కనుమరుగవగా మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 22, 2026, 06:15 PM IST|Updated: Sep 22, 2026, 07:03 PM IST
joinshare
Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌
Image Credit: Zee Telugu News
22 Sep 2026 19:03 IST (IST)
share

Rain Updates.. వర్షాలపై ముఖ్యమంత్రి అప్రమత్తం

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని సీఎం సూచనలు చేశారు.

22 Sep 2026 18:54 IST (IST)

Rain Live Updates.. హైదరాబాద్‌ శివారులో..

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వాన పడుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో భయానక వాతావరణం ఏర్పడింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, అమీన్‌పూర్, అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా ఈ వర్షానికి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

22 Sep 2026 18:51 IST (IST)

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Heavy Rain In Hyderabad.. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో
హైదరాబాద్‌లోని సైదాబాద్, ఐఎస్ సదన్, మాదన్నపేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మీర్‌పేట్, బాలాపూర్, బడంగ్‌పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, చంపాపేట్, సంతోశ్‌ నగర్ పరిసర ప్రాంతాల్లో  కుండపోత వర్షం పడింది.

22 Sep 2026 18:28 IST (IST)

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Heavy Rain In Hyderabad Live Updates.. ప్రధాన ప్రాంతాల్లో..
హైదరాబాద్‌లోని అన్నీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరం మధ్యలోని ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఆబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.

22 Sep 2026 18:26 IST (IST)

Hyderabad Rains: నిండా మునిగిన నగరం.. హైదరాబాద్‌లో భారీ వర్షం లైవ్‌ అప్‌డేట్స్‌

Hyderabad Rains: కూకట్‌పల్లి ప్రాంతంలో..
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, నిజాంపేట్, జేఎన్టీయూ, కూకట్‌పల్లి, వివేకానందనగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇన్నాళ్లు ఎండతో అల్లాడిన ప్రజలకు ఒకసారిగా వాతావరణం మేఘామృతమై ఉరుము మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. వర్షం రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad Rain Live Updates: వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది. ఉన్నఫళంగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. సాయంత్రం పూట భారీ వర్షం పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని దాదాపు అన్నీ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.