• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రోడ్డుపై 15 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్.. వామ్మె, వీడియో చూడండి!

రోడ్డుపై 15 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్.. వామ్మె, వీడియో చూడండి!

15 Foot King Cobra Viral Video: 15 అడుగులు కలిగిన అత్యంత పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపై హల్చల్ చేస్తుంటే.. ఒక స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ వీడియోలో పాము తోకను పట్టుకొని, ఎంతో నెమ్మదిగా దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు.. కానీ ఆ పాము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 03:25 PM IST|Updated: Sep 20, 2026, 03:27 PM IST
joinshare
రోడ్డుపై 15 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్.. వామ్మె, వీడియో చూడండి!
Image Credit: రోడ్డుపై 15 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్.. వామ్మె, వీడియో చూడండి!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

15 Foot King Cobra Viral Video: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన.. విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి.. ఒక్కసారి కాటు వేస్తే ఏనుగైన క్షణాల్లో మరణించి తీవ్రమైన విషం దీని సొంతం.. అలాంటి భారీ కోబ్రా రోడ్డుపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి చాలా భయమేస్తోంది. తాజాగా ఒక రద్దీ రోడ్డుపై దాదాపు 15 అడుగుల భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమై వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక ప్రధాన రహదారి పక్కనే సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా కనిపించింది.. రోడ్డు దాటే క్రమంలో అది వాహనాలకు అడ్డంగా ప్రయాణించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. రోడ్డుపై వేగంగా దూసుకొస్తున్న బైకులతో పాటు కార్ల కింద పడి ఆ జీవి చనిపోయే ప్రమాదం ఉండడంతో.. వాహనదారులపై అది ఎక్కడ దాడి చేస్తుందో అనే తీవ్ర ఆందోళన నెలకొంది..

సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఒక స్నేక్ క్యాచర్.. ఆ ప్రమాదకరమైన పామును సురక్షితంగా రక్షించేందుకు రంగంలోకి దిగాడు. ఆ రోడ్డుపై వాహనాల రాకపోకల మధ్య వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోబ్రా తోకను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు.. అయితే, ఈ సమయంలో ఆ పాము ఆగ్రహానికి గురై వెంటనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి పడగ విప్పి మరి బుసలు కొట్టేసింది. ఆ యువకుడి పై పలుసార్లు కాటేసేందుకు కూడా ప్రయత్నించింది.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Maulvi Ahmad Rafi (@maulvi_ahmad567)

ఆ క్షణంలో ఏ చిన్న తప్పు జరిగిన ప్రాణాలకే ముప్పు వాటినే పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతోపాటు అటు కుండా నడుచుకుంటూ వెళ్తున్నవా ఈ దృశ్యాన్ని చూస్తూ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.. పాము ఎన్నిసార్లు దాడికి ప్రయత్నించినప్పటికీ ఆ స్నేక్ క్యాచర్ ఏ మాత్రం భయపడలేదు.. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో పాముకాటుకు గురికాకుండా తప్పించుకుంటూ మరి ఆ పాము వెనక భాగాన్ని పట్టుకొని ఎంతగానో నియంత్రిస్తున్నాడు..

అనంతరం ఆ భారీ కోబ్రాను పట్టుకొని.. ఒక సంచిలో బంధించి దట్టమైన అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో మధ్యలోనే అయిపోవడంతో.. ఆ పామును దట్టమైన అడవిలో విడిచిపెట్టారని విషయంపై క్లారిటీ లేదు. కానీ వారు దానిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు..
 

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News