75 Year old married with 30 years Instagram blogger girl in uttar pradesh: చాలా మంది యువకులు ఇటీవల సరైన వయసులో వివాహలు కాక పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా కొంత మంది అమ్మాయిలు తమ డిమాండ్ లతో చుక్కలు చూపిస్తున్నారు. మంచి జాబ్, ప్యాకేజీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీలు ఉన్న వారితోనే పెళ్లికి రెడీ అంటున్నారు. దీంతో ఒకవైపు సరైన సెటిల్ మెంట్ లేక టెన్షన్ తో, పెళ్లికి ఏజ్ దాటి పోతూ యువత తలలు పట్టుకుంటున్నారు. మరికొంత మంది ఇటీవల పెళ్లి తర్వాత అమ్మాయిల టార్చర్ చేస్తున్న ఘటనలు చూసి అసలు పెళ్లిళ్లు అవసరమా..?..అంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
75 साल के रामसुगर, 30 साल की रानी राजपूत से शादी करने जा रहे हैं। दोनों को एक साल पहले मुहब्बत हुई थी। रिंग सेरेमनी हो चुकी है। नवरात्रि बाद शादी होगी। रानी इंस्टाग्राम पर Reel बनाती है। वो रामसुगर के घर उसकी बेटी से मिलने आती थी। इसी दौरान इश्क हो गया 📍जिला औरैया, उत्तर प्रदेश
— Sachin Gupta (@Sachingupta) October 15, 2026
కానీ దీనికి భిన్నంగా కొంత మంది లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్లు 50 ఏళ్ల తర్వాత కూడా ప్రేమాయణం సాగించి అమ్మాయిలను ముగ్గులోకి దింపుతున్నారు. ముసలి వయసులో యంగ్ అబ్బాయిలకు కొంత మంది ముసలొళ్లు ప్రేమ, పెళ్లి విషయంలో కాంపిటేషన్ కు వస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని ఔరయ్యా జిల్లాలో ఒక వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. 75 ఏళ్ల రామ్ షుగర్ సహార్ బ్లాక్ లోని అరియారిలో ఉంటున్నాడు. ఇతనికి 30 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ రాణికి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు పరస్పరం అంగీకారంతో పెళ్లికి రెడీ అయ్యారు. 75 ఏళ్ల రామ్ షుగర్ కు భార్య చనిపోయి ఏడేళ్లవుతుంది. ఇతను తరచుగా తన కూతురు రాధను కలిసేందుకు ఇంటికి వచ్చేది. దీంతో రామ్ షుగర్, రాణిలు ఒకర్ని మరోకరు ఇష్టపడ్డారు.
ఆ తర్వాత తరచుగా కలుసుకుంటూ ఒకరంటే మరోకరు విడిచి ఉండలేనంతగా వీరి మధ్య బంధం ఏర్పడింది. ఇటీవల తమ ప్రేమను ఇంట్లో వారికి చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో ఈ పెళ్లి ఏంటని కుటుంబ సభ్యులు నచ్చచెప్పిన రామ్ షుగర్ ఎవరి మాటలు వినలేదు. మరోవైపు ఇన్ స్టా బ్లాగర్ కు సైతం నచ్చ చేప్పడానికి చూశారు.
ఆమెకూడా ఆ ముసలొడే కావాలని పట్టుపట్టడంతో చేసేది లేక ఇటివల గ్రామంలో కొద్ది మంది బంధువుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది. 75 ఏళ్ల రామ్ షుగర్ హల్దీ, మెహందీ కార్యక్రమాలు చేసుకుని మరో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.దీన్ని చూసిన నెటిజన్లు ముసలొడికి దసరా పండగ అంటే ఇదేనేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.