80 year old Grandma Gym Workout Video: సాధారణంగా 80 ఏళ్లు దాటాయి అంటే చాలామందికి నడవడానికి కర్ర సహాయం ఎంతగానో అవసరం ఉంటుంది. చిన్నపాటి నొప్పులతో పాటు అలసటతో ఇంట్లోనే కాలం వెల్లదీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక బామ్మ మాత్రం వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ వస్తుంది.. సాంప్రదాయ చీరకట్టులో జిమ్ లోకి అడుగుపెట్టి.. భారీ బరువులను ఎంతో అవలీలగా ఎత్తుతూ నేటి యువతకు గట్టి ప్రేరణ కల్పిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫిట్నెస్ బామ్మ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దాదాపు 80 ఏళ్లు వయస్సున్న ఆ వృద్ధురాలు.. ఏమాత్రం బెరుకు లేకుండా జిమ్ లోని ఆధునిక పరికరాలను వినియోగించి వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది. సాధారణంగా ఫిట్నెస్ టీచర్స్ వేసుకునే ట్రాక్ సూట్లు కాకుండా.. నిండైన భారతీయ చీర కట్టులోనే ఆమె వ్యాయామం చేయడం విశేషం.. ముఖ్యంగా డంబెల్స్ తో పాటు భారీ వెయిట్స్ ఎత్తే.. మెషిన్లను ఉపయోగించి ఆమె చేసిన వర్కౌట్స్ చూసి పక్కనే ఉన్న యువకులు సైతం ఆశ్చర్య పోవడం మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు.. ఆమె ముఖంలో ఏమాత్రం అలసట కనిపించకుండా పట్టుదలతో ఎంతో హాయిగా వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది..
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది రోజుల్లోనే లక్షలాదిమంది వీక్షించినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో కామెంట్లతో ఇది దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా షేర్ కూడా చేస్తున్నారు. ఇది కథ అసలైన ఫిట్నెస్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఈ వయస్సులో ఆమెలో ఉత్సాహం చూస్తుంటే మా అందరికీ సిగ్గేస్తుంది అంటూ.. కామెంట్లు రాసుకు వస్తున్నారు. నేటి జీవన శైలిలో చిన్న వయసులోనే నడుము నొప్పులతో పాటు ఉబకాయంతో బాధపడుతున్న యువతకు ఈమె గొప్ప నిదర్శనం అని చాలామంది కామెంట్లలో రాసుకొస్తున్నారు..
శారీరక శ్రమతో పాటు దృఢమైన సంకల్పం ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా ఎంతటి క్లిష్టమైన పనులైనా సాధించవచ్చని ఈ బామ్మ వీడియో ద్వారా నిరూపిస్తూ వస్తుంది. రోజు వారి జీవితంలో శారీరక శ్రమ ఎంత అవసరమో ఆమె తీరు స్పష్టం చేస్తోంది.. ఏదేమైనా.. చీర కట్టులో జిమ్ చేస్తూ సమాజంలోని మూస దూరనులను బద్దలు కొట్టిన ఈ సూపర్ బామ్మ నిజంగానే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా భావించవచ్చు..