8th Pay Commission Salary Pension Hike: కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, రక్షణ రంగ సిబ్బందితో పాటు పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 8వ కేంద్ర వేతన సంఘం తన కసరత్తును వేగవంతం చేసింది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా, ప్రముఖ ఫైనాన్స్ ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి ఏర్పాటు చేసే ఈ వేతన సంఘం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు (మొత్తంగా కోటి మందికి పైగా) ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
12 కీలక డిమాండ్లతో పెన్షనర్ల విజ్ఞప్తి..
నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) వంటి ప్రధాన సంఘాలు కమిషన్ ముందు 12 కీలక డిమాండ్లను సమర్పించాయి. ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి తీసుకున్న చివరి జీతంలో కనీసం 67 శాతం లేదా చివరి 10 నెలల సగటు వేతనాన్ని బట్టి కనీస పెన్షన్‌ను నిర్ణయించాలని కోరాయి.
వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ ప్రతిపాదన..
వయోవృద్ధులైన పెన్షనర్ల జీవన, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పెంపును కోరారు. దీని ప్రకారం.. 65 ఏళ్లకు చివరి జీతంలో 70% పెన్షన్.. అలాగే 70 ఏళ్లకు 75%, 75 ఏళ్లకు 80%, 80 ఏళ్లకు 85%, 85 ఏళ్లకు 90% చొప్పున పెంపు 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చివరిగా తీసుకున్న 100% పూర్తి జీతాన్ని పెన్షన్‌గా అందించాలనేది ప్రతిపాదనగా వస్తుంది.
OPS, NPS, UPS ఎంచుకునే స్వేచ్ఛ..
పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడంతో పాటు, ఉద్యోగుల అవసరాలను బట్టి OPS, NPS లేదా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS)లలో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సవరణ, కరువు భత్యాన్ని (DR) బేసిక్ పెన్షన్‌లో విలీనం చేయడం, గ్రాట్యుటీ పరిమితి పెంపు కూడా ఇందులో ఉన్నాయి.
అదే విధంగా కమ్యుటెడ్ పెన్షన్ పునరుద్ధరణకు ప్రస్తుతం పడుతున్న 15 ఏళ్ల వ్యవధిని 10 నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని సంఘాలు కోరాయి. దీనికోసం 1981 నాటి సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్ 10ఎ ను సమీక్షించాలని స్పష్టం చేశాయి.
అమలు ఎప్పటి నుంచి?
3 నవంబర్ 2025న ఏర్పాటైన ఈ వేతన సంఘం 18 నెలల వ్యవధిలో, అంటే మే 2027 నాటికి తన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. 2027 ఫిబ్రవరి లేదా ఏప్రిల్ నాటికి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
Also Read: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? సెప్టెంబరు 11న ఆంధ్ర, తెలంగాణల్లో పరిస్థితి ఇదే!
Also Read: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్తరూల్స్..ఎన్నిసార్లు విత్‌డ్రా చేయోచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook