SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abhijeet Dipke CJP Funds: క్రాక్రోచ్‌లకు నిధులు ఇస్తున్న అమెరికా సంస్థ ఇదే! అభిజీత్ దీప్కేపై షాకింగ్ రివీల్!

Abhijeet Dipke CJP Funds: భారత్‌లో సాగుతున్న వివిధ ఆందోళనలకు, నిరసనలకు అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్, ఆయన నెట్‌వర్క్ నిధులు సమకూరుస్తున్నాయని ప్రసిద్ధ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వైఖరులపై విమర్శలు గుప్పించిన ఆమె, విధ్వంసకర నిరసనల కంటే శాంతియుత మార్గాలు, నిర్మాణత్మక చర్చలే దేశానికి ప్రయోజనకరమని హితవు పలికారు.

Written By Harish Darla
Published: Oct 16, 2026, 12:47 PM IST | Updated: Oct 16, 2026, 12:50 PM IST
Join

Abhijeet Dipke CJP Funds: భారతీయ యువతను ఉద్దేశించి విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సందేశంలో అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకించి సంప్రదాయవాద నాయకులు అధికారంలో ఉన్న దేశాల్లో గందరగోళం సృష్టించడానికే అమెరికాలోని ఒక వర్గం, జార్జ్ సోరోస్ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు ఫండింగ్ ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే, తన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి ఆధారాలను ఆమె బహిరంగంగా ప్రదర్శించలేదు.

సీజేపీ నేతతో వాగ్వాదం..
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో సోషల్ మీడియాలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో మిల్బెన్ ఈ కామెంట్లు చేశారు. జార్జ్ సోరోస్ తనకి నిధులిస్తున్నట్లు గతంలో దీప్కే సోషల్ మీడియాలో వెల్లడించారని, అమెరికాలోని కొందరు దాతలు కూడా సీజేపీకి ఫండింగ్ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. దీప్కే తన వద్ద ఉన్న సామర్థ్యాన్ని, ప్రజలను సమీకరించే ప్రతిభను నిరసనలకు కాకుండా దేశాభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. వీధి పోరాటాలకు బదులుగా ప్రధాని నరేంద్ర మోదీని, ప్రభుత్వ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా పంచుకోవాలని హితవు పలికారు.

రాజకీయ నాయకత్వంపై విమర్శలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీజేపీ నేత దీప్కే ఇద్దరిలోనూ ప్రస్తుత ప్రభుత్వంతో కలిసి పనిచేసే నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని మిల్బెన్ అభిప్రాయపడ్డారు. వారి ఆందోళనలు దేశంలో ఐక్యతను పెంచేలా లేవని, సమస్యలకు ఎటువంటి పరిష్కారాలూ చూపడం లేదని విమర్శించారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేపట్టిన శాంతియుత ఉద్యమాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మార్పు అనేది విధ్వంసం ద్వారా కాకుండా శాంతియుత మార్గాల ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోనే అత్యుత్తమ నేతల్లో ఒకరిగా కొనియాడిన ఆమె, 2029లో కూడా ఆయనే మళ్లీ ప్రధానిగా ఎన్నికవుతారని జోస్యం చెప్పారు.

ఢిల్లీ ఆందోళనల నేపథ్యం
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిరసిస్తూ సీజేపీ, ఇతర విపక్ష పార్టీలు ప్రస్తుతం ఢిల్లీలో ఆందోళనలు చేపడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో భారత జాతీయ గీతాన్ని ఆలపించిన మిల్బెన్, త్వరలోనే భారత్‌కు వచ్చి ఇక్కడి యువతను నేరుగా కలవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES