• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ మిథున్‌పై దాడి ఘటనపై ఫోన్ చేసి ఆరా! చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం..

వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ మిథున్‌పై దాడి ఘటనపై ఫోన్ చేసి ఆరా! చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం..

పుంగనూరు రాయచోటి పరిసర ప్రాంతాల్లో వైసీపీ లోక్‌సభ పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై జరిగిన దాడి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మిథున్ రెడ్డి తన నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్తుండగా, టిడిపి శ్రేణులు కత్తులు, రాళ్లతో ఆయన కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున దాడికి దిగారు. ఈ దుర్ఘటనలో మిథున్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్నవారికి గాయాలయ్యాయి, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పది వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదకర ఘటనపై స్పందించిన జగన్, వెంటనే ఎంపీ మిథున్ రెడ్డికి ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు.

Written ByRenuka Godugu
Published: Oct 16, 2026, 02:21 PM IST|Updated: Oct 16, 2026, 02:28 PM IST
joinshare
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ మిథున్‌పై దాడి ఘటనపై ఫోన్ చేసి ఆరా! చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం..
Image Credit: ys jagan news today

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

2

Bhuvneshwar Kumar: వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ జట్టులోకి ఎంట్రీ..!

3

‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో స్టార్ హీరోయిన్..?

4

మాయమాటలను గుడ్డిగా నమ్మకూడని చెబుతున్న... తోడేలు తంత్రం - కుందేలు అమాయకత్వం నీతి కథ...!!

5

చీకట్లో మెరుస్తున్న నాగమణి.. చుట్టూ కింగ్ కోబ్రా కాపలా.. వీడియో ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ys jagan news today: ఎంపీ మిథున్‌ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి గురించి, సీఎం చంద్రబాబు నాయుడు తీరును ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ శ్రేణులు ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. రాజకీయాల్లో హింసను ప్రదర్శించడం చంద్రబాబుకు కొత్త విషయం కాదని, ఆయన రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యాంగా మారుస్తున్నారని విమర్శించారు.

ఒక ప్రముఖ పార్టీ లోక్‌సభ పక్ష నేతకే రాష్ట్రంలో సరైన భద్రత లేకపోవడం కూటమి పాలన  వైఫల్యాన్ని సూచిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలన సజావుగా సాగాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఏమాత్రం లేదని, ప్రజలు రెండున్నర ఏళ్ల పరిపాలన పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ దాడులు జరుగుతున్న సమయంలో కూడా రాష్ట్ర పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోవడం, కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.  ప్రజలకు మంచి చేసిన చరిత్ర తమదంటూ, హింసతో రాష్ట్రాన్ని నాశనం చేసే చరిత్ర చంద్రబాబు నాయుడుది అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.

Read Also: టీడీపీ Vs వైసీపీ..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత..ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి!
 

ఈ అన్యాయాలను, టీడీపీ శ్రేణుల దాడులను వైఎస్ఆర్సిపి పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, చట్టపరంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలను ఎంతో ధైర్యంతో, సాహసంతో ఎదుర్కొంటామని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను కోర్టు ముందు కూడా ఉంచుతామని ఆయన హెచ్చరించారు. నామినేషన్లు వేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని పార్టీ నేతలు విమర్శిస్తుండగా, ఈ దాడికి పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షించాలని, వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని వైసీపీ పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంమీద, మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన ఈ రాళ్ల, కత్తుల దాడి వల్ల వాహనాలు ధ్వంసమవడంతో పాటు పలువురు గాయపడటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

 

ఎంపీ మిథున్‌కు మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి ఫోన్‌ ఎంపీ మిథున్‌కు మాజీ సీఎం వైయస్‌.జగన్‌ ఫోన్‌ టీడీపీ గూండాల దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న వైయస్‌.జగన్‌ ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదు:వైయస్‌.జగన్‌ రెండున్నరేళ్ల పరిపాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అందుకనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారు హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదు: రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చారు లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నా చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు: పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారు: దాడులు జరుగుతున్న పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోంది: ఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాం: ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటాం: రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతాం: పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయి: ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతాం: ప్రజలకు మంచి చేసిన చరిత్ర మాది : హింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుది:

— YSR Congress Party (@YSRCParty) October 16, 2026

 

ఇదిలా ఉండగా పుంగనూరు స్థానిక ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియలో తొలిరోజే దాడులు జరగడం మొదలైంది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడులు జరగడమే కాకుండా, ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు ఇతర కార్లను కూడా ధ్వంసం చేయడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో పరిస్థితులు అత్యంత తీవ్రమైన రూపం దాల్చడంతో, పోలీసులు ఇతర ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డిని తక్షణమే నామినేషన్ కేంద్రంలోని ఒక సురక్షిత గదిలోకి తరలించి రక్షణ కల్పించారు. అయితే, టీడీపీ నాయకులు, వారి శ్రేణులు కూడా అదే సురక్షిత గది వైపు దూసుకెళ్లడంతో, సుమారు గంటసేపు అక్కడే ఉండాల్సిన క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల అనుచరులను అక్కడి నుండి చెదరగొట్టడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu