• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /దేవీశ్రీ ప్రసాద్‌ను వద్దంటున్న సుకుమార్.. తొలిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో సుక్కు..

దేవీశ్రీ ప్రసాద్‌ను వద్దంటున్న సుకుమార్.. తొలిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో సుక్కు..

Sukumar -Devisri Prasad: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఆర్య’ మూవీతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు సుకుమార్. అప్పటి నుంచి సుకుమార్ సినిమా అనగానే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే. అలా వారి బాండింగ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ రిలేషన్‌కు ఇపుడు బ్రేక్ పడబోతున్నట్టు తెలుస్తుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 02:29 PM IST|Updated: Oct 16, 2026, 02:54 PM IST
joinshare
దేవీశ్రీ ప్రసాద్‌ను వద్దంటున్న సుకుమార్.. తొలిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో సుక్కు..
Image Credit: Sukku - Devisri (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

2

Bhuvneshwar Kumar: వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ జట్టులోకి ఎంట్రీ..!

3

‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో స్టార్ హీరోయిన్..?

4

మాయమాటలను గుడ్డిగా నమ్మకూడని చెబుతున్న... తోడేలు తంత్రం - కుందేలు అమాయకత్వం నీతి కథ...!!

5

చీకట్లో మెరుస్తున్న నాగమణి.. చుట్టూ కింగ్ కోబ్రా కాపలా.. వీడియో ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

With out Devisri Prasad Sukumar Movie: రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో సుకుమార్ నుంచి సినిమా వస్తుందంటే  DSP (దేవీశ్రీ ప్రసాద్) మ్యూజిక్ ఉండాల్సిందే. అలా వీరిద్దరి కాంబోకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాంటి బ్లాక్ బస్టర్ కాంబోకు నిజంగానే ఎండ్ కార్డ్ పడనుందా..? సుక్కు సినిమా అంటే గ్యారెంటీగా వినిపించే దేవీ మార్క్ మ్యూజిక్ ప్లేస్‌లో ఫస్ట్ టైమ్ మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. తన ప్రతీ ప్రాజెక్టులో రాక్‌స్టార్‌ను గుడ్డిగా నమ్మే ఈ లెక్కల మాస్టారు.. త్వరలో రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న  సినిమా కోసం వేరే ఆప్షన్ వెతుక్కుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. .

తెలుగు సహా వివిధ భాషల్లో కొంత మంది దర్శకులు తమకు సంబంధించిన టీమ్‌ను అంత ఈజీగా మార్చారు. ఒకపుడు శంకర్ సినిమా అంటే ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఉండాల్సిందే. ఇక ‘అపరిచితుడు’ సినిమాకు హారీస్ జై రాజ్‌తో ఈ కాంబోకు బ్రేక్ పడింది. ఇక రాజమౌళి సినిమా అంటే కీరవాణి సంగీతం ఉండాల్సిందే. తొలి సినిమా నుంచి రాబోయే వారణాసి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది.  ఇక దర్శకుడు సుకుమార్‌కు గత 20 ఏళ్ళుగా దేవీశ్రీ ప్రసాద్  కూడా అలాగే మ్యూజిక్ ఇస్తున్నాడు.  ఇన్నేళ్ల సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ హిట్ పెయిర్ మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది.

రామ్ చరణ్‌తో సుక్కు చేయబోయే సినిమా కోసం దేవీని కాదని.. అనిరుధ్‌ వైపు లెక్కల మాస్టారు అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది. ఫ్రెష్ సౌండింగ్ కోసమే దేవీశ్రీప్రసాద్‌ను  పక్కనపెట్టి.. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌ను సుక్కు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.  కానీ సడెన్‌గా అనిరుధ్ పేరు వచ్చేసరికి సుక్కు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆ కొత్త మార్పు ఏంటో అర్థం కాక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అనిరుధ్ ఇచ్చేది కూడా పక్కా కమర్షియల్ మాస్ ట్యూన్సే కదా.. ఆ రేంజ్ మ్యూజిక్ DSP ఇవ్వలేరా అనే డౌట్స్ ఇపుడు అందరికీ వస్తున్నాయి. కానీ సుకమార్‌కు కూడా రొటీన్ భిన్నంగా ఈ సారి కొత్త ప్రయత్నించాడానికే దేవీశ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.

గత కొన్నేళ్లుగా దేవీశ్రీ ఫామ్ కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ.. సుకుమార్ అనగానే ఆయన ప్రాణం పెట్టి పని చేస్తుంటారు. కీరవాణి కూడా వేరే వాళ్లకు ఓ రకం మ్యూజిక్ ఇస్తే.. రాజమౌళి, అంతకు ముందు కే.రాఘవేంద్ర రావు సినిమాలకు మరో తరహా సంగీతం అందించే వారు. మొత్తంగా  తన ఆలోచనలను మాటల్లేకుండానే పసిగట్టే దేవీని పక్కనబెట్టి అనిరుధ్ వైపు చూడటం చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. మరి నిజంగానే దేవీ, సుకుమార్ 20 ఏళ్ళ స్నేహానికి ఎండ్ కార్డ్  పడుతుందా..రామ్ చరణ్‌తో చేయబోతున్న సినిమాకు అనిరుధ్ ను తీసుకుంటారా లేదా  అనేది దసరా తర్వాత తేలబోతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News