కూర రుచిగా లేదన్నందుకు ఘోరం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య..
Crime News: భర్తకు కూర నచ్చలేదని భార్యకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. ఇందులో భాగంగానే భార్య చాక్‌తో ఆ భర్త ఛాతిలో పొడిచింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ఘటన జరిగి చాలా రోజులవుతున్న.. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Crime Telugu News: సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరగడం అత్యంత సర్వసాధారణం. కానీ.. క్షణికావేశం అదుపుతప్పితే ఆ గొడవలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. వండిన కూర రుచిగా లేదని భర్త అన్న ఒకే ఒక్క మాట.. అతని ప్రాణాలనే బలితీసుకునేలా చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య కత్తితో పొడిచి భర్తను హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పోలీసులతో పాటు స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో దిలీప్ ఖరాడి (39), నిర్మలా ఖరాడి (34) అనే దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. దిలీప్ గతంలో ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారట.. ప్రస్తుతం ఆయన గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారట.. ఎప్పటిలాగే తన రోజువారీ డ్యూటీ ముగించుకున్న దిలీప్.. రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నారట..
అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు భార్య నిర్మల రోజులాగే భోజనం కూడా వడ్డించిందట.. భోజనం చేస్తున్న క్రమంలో కూర రుచిగా లేదని దిలీప్ తన భార్యతో అన్నాడట.. ఈ విషయంపై మొదలైన మాటల యుద్ధం కాస్తా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిందట. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఇద్దరూ విచక్షణ కోల్పోయినట్లు తెలుస్తోంది..
గొడవ ఉన్నట్లుండి.. పీక్స్‌కు చేరడంతో తీవ్ర ఆవేశానికి గురైన నిర్మల విచక్షణ కోల్పోయింది. వెంటనే వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తిని తీసుకువచ్చి.. దిలీప్‌పై ఒక్కసారిగా దాడి చేసిందట. ఈ దాడిలో దిలీప్ ఛాతీ భాగంలో కత్తి బలంగా దిగడంతో ఆయన తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయారట.. అతని పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు హుటాహుటిన ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారట.. అయితే, అప్పటికే తీవ్ర గాయాలపాలైన దిలీప్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
దేశ సరిహద్దుల్లో సేవ చేసిన ఒక మాజీ సైనికుడు.. ఇలా ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.. సమాచారం అందుకున్న నరోడా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కారణాలు తెలుసుకున్నారట. నిందితురాలు నిర్మలా ఖరాడిని అదుపులోకి తీసుకుని.. హత్య కేసు నమోదు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారట..