SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amazon సేల్‌లో iQOO ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్.. రూ.5,000 వరకు డిస్కౌంట్!

Iqoo Z11 Series Offers: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఐకూ Z11 సిరీస్‌లపై అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పడే కొనుగోలు చేసేవారికి కొన్ని మోడల్స్‌పై రూ.5 వేల వరకు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అయితే, ఏయే మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్స్ లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 03:52 PM IST | Updated: Oct 10, 2026, 03:54 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Iqoo Z11 Series Offers: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌కి సంబంధించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అనేక రకాల వస్తువులపై అద్భుతమైన ఆఫర్స్‌ అందబాటులోకి వచ్చాయి. అయితే, స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి ఈ సేల్‌ అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ ఐకూ (iQOO) సంబంధించిన కొన్ని మొబైల్స్‌ ఎప్పుడూ లేని డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తూ వస్తున్నాయి. iQOO Z11 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఏకంగా రూ.5 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండడం విశేషం. అయితే, ఏయే మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్స్ లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సేల్‌లో ఐకూ Z11 సిరీస్‌లపై భారీ ఆఫర్స్‌..
ఐకూ Z11 (iQOO Z11)
ఈ మోడల్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా అమెజాన్‌లో ఇప్పుడే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి రూ.30,999కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇవే కాకుండా దీనిపై మరెన్నో అద్భుతమైన ఆఫర్స్‌ లభిస్తూ వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.83 అంగుళాల 144Hz అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇదిబ 7050mAh భారీ బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.. ఇది 50MP ప్రధాన కెమెరాతో పాటు IP69 రేటింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది..

ఐకూ Z11xa (iQOO Z11xa)
ఇక ఈ ఐకూ Z11xa మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌పై కూడా అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అమెజాన్‌లో దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.3,000 కూపన్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో రూ.1,500 వరకు బ్యాంక్ కూడా లభిస్తోంది. దీంతో మీకు ఇది కేవలం రూ.24,499కే అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో ప్రాసెసర్‌తో లభిస్తోంది.

ఐకూ Z11x (iQOO Z11x)
ఈ మోడల్‌ ధర రూ.27 వేలుగా ఉంది.. అయితే, ఇప్పుడే దీనిని ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి కేవలం చీప్‌గా రూ.3,000 వరకు తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.25,999కే లభిస్తోంది. ఇదే కాకుండా అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తూ వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ఏకంగా 7200mAh భారీ బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులో ఉంది.

ఐకూ Z11 లైట్ (iQOO Z11 Lite)
ముఖ్యంగా ఐకూ Z11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఇది చీప్‌ ధరకే లభిస్తోంది. సాధారణంగా రూ.19,999 ధరతో అందుబాటులో ఉంది.. అయితే, దీనిని ఇప్పుడే రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించి దీనిని కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.15,499కే లభిస్తుంది. ఇది 6.74 అంగుళాల 120Hz డిస్‌ప్లేతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES