• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

AP Cabinet Decides Of BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక కొలిక్కి వచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 10, 2026, 04:52 PM IST|Updated: Oct 10, 2026, 04:56 PM IST
joinshare
BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?
Image Credit: AP BC Reservations

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

2

EPF UPI Withdrawal: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఈపీఎఫ్ విత్‌డ్రా ట్రయల్ రన్ విజయవంతం..ఆరోజు నుంచే అమల్లోకి!

3

KTR Letter: రూ.3,296 కోట్ల కుంభకోణం..? రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్‌!

4

BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

5

Elon Musk Starlink: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ 'స్టార్‌లింక్' ఇంటర్నెట్ వస్తే లాభమా? నష్టమా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ముగిసిపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్ల పెంపు ఆగిపోయింది. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఖరారు చేసింది. వెనుకబడిన తరగతులు (బీసీ) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల శాతాలను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా మొత్తం 8 విభాగాల్లో (కేటగిరీలలో) రిజర్వేషన్ల శాతాన్ని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేటగిరీల వారీగా బీసీ రిజర్వేషన్ల మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, అర్బన్‌ వార్డులు, సర్పంచ్‌ స్థానాలు, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌కు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఏపీ మంత్రివర్గం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేటాయింపులు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు ఖరారు చేయడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

బీసీ రిజర్వేషన్లు ఇలా
మేయర్ పదవులు: 35.29 శాతం

మున్సిపల్ చైర్మన్ పదవులు: 33.02 శాతం

అర్బన్ వార్డులు: 32.78 శాతం

సర్పంచ్ స్థానాలు: 27.95 శాతం

పంచాయతీ వార్డులు: 26.73 శాతం

ఎంపీటీసీ స్థానాలు: 25.55 శాతం

ఎంపీపీ పదవులు: 24.60 శాతం

జెడ్పీటీసీ స్థానాలు: 24.60 శాతం

జడ్పీ చైర్మన్ పదవులు: 23.08 శాతం

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Telugu News
Trending News