SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అమెజాన్‌లో రూ.13,999కే స్మార్ట్‌ఫోన్.. Samsung, OnePlus, iQOO, Redmi ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Best Smartphone Deals Amazon: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వేటిపై ఎక్కువగా ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 03:45 PM IST | Updated: Oct 07, 2026, 03:46 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Best Smartphone Deals Amazon: పండగల సీజన్‌ సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్ లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లయిన సాంసంగ్‌, వన్‌ప్లస్‌తో పాటు ఐకూ (iQOO), రెడ్‌మీ, షావోమి, లావా వంటి ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను అమెజాన్‌ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం రూ.13,999 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులో ఉండడం విశేషం.. అయితే, ఏయే స్మార్ట్‌ఫోన్స్‌ ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో? వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సేల్‌లో భాగంగా  ఎస్‌బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డు ఈఎంఐ పేమెంట్‌ చేసేవారికి ఏకంగా 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసేవారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే నాన్-ప్రైమ్ వారికి ప్రత్యేకంగా 3 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఇవే కాకుండా అదనంగా ప్రత్యేకమైన కూపన్స్‌తో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అద్భుతమైన ఎక్చేంజ్ బోనస్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

మిడ్ రేంజ్ డీల్స్ వివరాలు..
ఈ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా లావా బోల్డ్ N4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి బ్యాంకు ఆఫర్లతో కలిపి.. రూ.13,999లోపే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా రెడ్‌మీ 15C 5G ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15,999కే లభించబోతోంది.. ఇక సాంసంగ్‌ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.16,999కే అందుబాటులో ఉంది. ఇవే కాకుండా వన్‌ప్లస్ మోడల్స్‌లో వన్‌ప్లస్ N6 మోడల్ రూ. 21,999కే.. వన్‌ప్లస్ CE 6 లైట్ రూ.26,999కే లభించబోతోంది.. అలాగే ఐకూ Z11xa స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.24,999 లోపే అందుబాటులోకి రాబోతోంది..

ఇక సాంసంగ్‌ గెలాక్సీ A56 5G మోడల్‌ను రూ.31,999 ధరతో అందుబాటులో ఉండగా.. వన్‌ప్లస్ నార్డ్ CE 6ను రూ. 33,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌ వివరాల్లోకి వెళితే.. వన్‌ప్లస్ నార్డ్ 6 ప్రీమియం మోడల్ రూ.42,999 ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ కూపన్ ఆఫర్లతో కలిపి ఇది ధర రూ.46,499తో అందుబాటులో ఉంది. ఇక షావోమి 17 స్మార్ట్‌ఫోన్‌ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్లను కలుపుకొని రూ.59,999 ధరకే అందుబాటులో ఉంది.. సాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్ 7 5G ఫోన్ రూ.1,29,999కే లభించడం విశేషం..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES