• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /RK Roja: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భక్తుల కాళ్లు కడిగి.. తిరుమల మెట్లు కడగాలి: రోజా

RK Roja: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భక్తుల కాళ్లు కడిగి.. తిరుమల మెట్లు కడగాలి: రోజా

RK Roja Serious Comments About Chandrababu And Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ చెప్పిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు. తిరుమల లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. భక్తుల కాళ్లు కడగాలి.. తిరుమల మెట్లు కడగాలని సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 04:57 PM IST|Updated: Oct 07, 2026, 05:00 PM IST
joinshare
RK Roja: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భక్తుల కాళ్లు కడిగి.. తిరుమల మెట్లు కడగాలి: రోజా
Image Credit: RK Roja vs Chandrababu

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Candy Crush New Record: క్యాండీ క్రష్ గేమ్‌లో బీహార్ కుర్రాడు వరల్డ్ రికార్డు..22,222 లెవల్‌ చేసుకున్న శుభమ్ కుమార్!

Candy Crush New Record: క్యాండీ క్రష్ గేమ్‌లో బీహార్ కుర్రాడు వరల్డ్ రికార్డు..22,222 లెవల్‌ చేసుకున్న శుభమ్ కుమార్!

2

8,000mAh బ్యాటరీతో Vivo Y32.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్!

3

RK Roja: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భక్తుల కాళ్లు కడిగి.. తిరుమల మెట్లు కడగాలి: రోజా

4

రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

5

Pitru Paksha 2026: సర్వ పితృ అమావాస్య ప్రభావం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.!.. మీరున్నారా..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala Laddu Ghee Row: 'తిరుమల శ్రీవారి లడ్డూపై సీబీఐ విచారణ కొవ్వు కలవలేదని చాలా స్పష్టంగా చెప్పింది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం ఎలా విషం చిమ్మాలని అనిపించింది. సీబీఐ నెల్లూరు కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌లో ఎక్కడ కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పింది. అయినా పవన్ కల్యాణ్, చంద్రబాబుకు మనిషి పుట్టుక పుట్టి సిగ్గు తెచ్చుకుని మౌనంగా ఉన్నారు. అసెంబ్లీలో సాక్షిగా కెమికల్స్ కలిశాయని అబద్ధాలు చెప్పలేదా?' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా నిలదీశారు. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని కోరారు. వెన్నుపోట్లు, కత్తిపోట్లు, గుండెపోటు, గొడ్డలి పోట్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగాయని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు.

చిత్తూరులో ఏర్పాటుచేసిన బుధవారం మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌ మోహన్ రెడ్డిపై నిందలు మోపిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆర్‌కే రోజా డిమాండ్‌ చేశారు. హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్‌కు నెయ్యి టెండర్లు కట్టబెట్టేందుకు నెయ్యిపై విషం చిమ్మారని తెలిపారు. హిందూ భక్తులు కాళ్లు కడిగి.. ఏడుకొండల మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకురాలు రోజా సూచించారు.

అందరీ కొవ్వు కరిగించే రోజూ దగ్గరలోనే ఉందని కూటమి నాయకులకు మాజీ మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు. 'హైదరాబాద్ చిడతలు కొట్టుకుంటూ వచ్చిన మహిళ ఎక్కడ? తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను నిలదీయాలని కోరారు. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవించినవాళ్లు అవుతారని పేర్కొన్నారు. మోదీ, పవన్ కల్యాణ్ హిందువులు మనోభావాలు దెబ్బతీసిన వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా వీళ్లపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

'మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టిడిపి,జనసేన గ్రాఫ్ పడిపోయింది, సొంత సర్వేల్లో నిజమైంది. నిరుద్యోగులను నట్టేట ముంచారు, నిరుద్యోగ భృతి లేదు. పవన్ కల్యాణ్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు ఒత్తిడి తీసుకోవాలి. యువత పక్కా రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు' అని మాజీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'చంద్రబాబు నాయుడు కరువు కవలపిల్లలు అని ఎప్పుడో వైఎస్సార్ చెప్పారు. ఇప్పుడూ అదే జరుగుతుంది' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నేపథ్యంలో నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

'ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వివేక హత్యతో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి సంబంధం లేదని సీబీఐ విచారణలో చాలా స్పష్టంగా చెప్పింది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది వాస్తవం కాదా?' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. సీబీఐ విచారణలో వైఎస్ జగన్‌కు ఈ హత్య కేసులో స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సునీతతో పిటిషన్ వేయించావో ప్రజలు అందరికి తెలుసని పేర్కొన్నారు.

'హత్యతో సంబంధం ఉన్న వాళ్లతో నిందితులను నువ్వు కాపాడుతున్నది వాస్తవం కాదా? రాజారెడ్డి హత్య కేసుతో, వివేక హత్య నేరస్తులను కాపాడుతుంది నువ్వు కాదా చంద్రబాబు! దస్తగిరి నేనే హత్య చేశానని చెబుతున్నాడు. నీ లాయర్‌ అతడికి వాదిస్తున్నాడు. మీ ఆఫీస్ చుట్టూ దస్తగిరి తిరుగుతున్నది వాస్తవం కాదా? వంగవీటి రంగ హత్య, ఎన్టీఆర్ మృతి వెనుక మీరు లేరా?' అని చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
YCP
AP News
Telugu News
Trending News