గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!
Ancient Indian Fireworks: కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో చిచ్చుబుడ్లు, భూచక్రాలు అస్సలు లేకపోయేవి.. అయినప్పటికీ మన పూర్వీకులు బాణాసంచాలను కాల్చుతూ ఉండేవారు.. అసలు వారు ఇంట్లోనే ఎలా వాటిని తయారు చేసుకునేవారో? భారతీయ గ్రంథాల్లో వివరించిన మండే పదార్థాలేంటో? వీటినికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Ancient Indian Fireworks: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. మనకు ముందుగా గుర్తొచ్చేవి రంగురంగుల చిచ్చుబుడ్లు, కాకరపువ్వులు.. నేలపై అద్భుతంగా గిర్రున తిరిగే భూచక్రాలు, చెవులు దిమ్మెక్కించే లక్ష్మీ బాంబులు.. అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ బాంబుల్లో వినియోగించే రసాయన మందుగుండు అందుబాటులోకి రాని ప్రాచీన కాలంలో మన పూర్వీకులు దీపావళి వేడుకల్లో వేటిని వినియోగించేవారో అనేది ఇప్పుడు అందరికీ కలిగే ఒక ఆసక్తికరమైన ప్రశ్న.. టపాసుల్లో వినియోగించే గన్‌పౌడర్ రాకముందు భారతదేశంలో ప్రకృతి ప్రసాదించిన వనరులతోనే అద్భుతమైన కాంతితో పాటు శబ్ద విన్యాసాలు చేసేవారని ప్రాచీన చారిత్రక ఆధారాలు చెబుతూ వస్తున్నాయి..
ప్రాచీన కాలంలో బాంబుల శబ్దాన్ని సృష్టించేందుకు ప్రధానంగా పచ్చి వెదురు బొంగులను వినియోగించేవారట.. ఆ వెదురు కొమ్మలను అగ్నిగుండంలో వేసినప్పుడు.. లోపలి గాలి వేడెక్కి ఒత్తిడికి గురై పెద్ద శబ్దంతో పేలిపోయేదట.. దీనిని మరింత తీవ్రతరం చేయడానికి వెదురు కణుపుల లోపల ముడి ఉప్పును నింపి వేడిచేసేవారట.. ఉప్పు వేడికి పగిలేటప్పుడు పటపటలాడే పెద్ద చప్పుడు వస్తూ.. రాత్రి పూట ప్రత్యేకమైన వినోదాన్ని అందించేదట.. గ్రామాల్లో దుష్ట శక్తులను, విష కీటకాలను తొలగించేందుకు ఈ సహజ సిద్ధ పద్ధతిని పాటించేవారని సమాచారం..
అంతేకాకుండా ప్రకృతిసిద్ధమైన కాంతుల కోసం రకరకాల ఎండిన వనమూలికలతో పాటు చెట్ల జిగుర్లు, సల్ఫర్, ముడి పొటాషియం నైట్రేట్, సున్నపురాయి, ప్రత్యేక లోహ చూర్ణాలను కలిపి మట్టి పాత్రల్లో లేదా గొట్టాల్లో నింపేవారట.. ఆ మిశ్రమానికి నిప్పు అంటించినప్పుడు ఆకాశంలోకి పొగతో పాటు వివిధ రంగుల ప్రకాశవంతమైన వెలుగులు వచ్చేవాట.. ఇవి పరిసరాలకు హాని కలిగించకుండా.. కేవలం అద్భుతమైన వాసనతో పాటు పొగతో.. కంటికింపుగా ఉండేవి.
భారతీయ గ్రంథాల్లో మండే పదార్థాల తయారీ గురించి అనేక రకాలుగా వివరిస్తూ వచ్చారు. చాణక్యుడు రచించిన ప్రసిద్ధ అర్థశాస్త్రంలో యుద్ధ తంత్రాలకు సంబంధించిన ఆగ్నేయాస్త్రాలతో పాటు పొగను చిమ్మే రసాయన మిశ్రమాలు, అగ్ని బాణాల తయారీ సూత్రాలను అద్భుతంగా వివరించారు. అగ్నిని పూలలా విరజిమ్మే విధానాలతో పాటు రాజుల ఉత్సవాలలో ఉపయోగించిన అగ్ని విన్యాసాల గురించి ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో అనేక రకాలుగా వివరించారు.