Nashik niphad residence activist dump stray dogs inside civic office: ఇటీవల దేశ వ్యాప్తంగా శునకాల కాటు ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కుక్కల కాటుకు గురౌతున్నారు. ముఖ్యంగా స్కూళ్లు, ఖాళీ ప్రదేశాలు, రోడ్లమీద ఎక్కడంటే అక్కడ వీధిశునకాలు సంచరిస్తు దొరికిన వాళ్లను దొరికినట్లు పిక్కలు కొరికి హడలెత్తిస్తున్నాయి.
🚨 NASHIK : Yuva Sena district chief Vikram Randhave staged a protest over the stray dog issue in Niphad, releasing dogs inside the Nagar Panchayat office. Activists claimed rising attacks and alleged repeated complaints have failed to bring effective action. pic.twitter.com/STBs1shjPL
— indiainlast24hr (@indiain24hr) September 16, 2026
ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలలో ఇటీవల శునకాల దాడులతో ప్రజలు విసిగిపోయారు. ముఖ్యంగా నిఫాడ్ పట్టణంలోని ప్రజలు కుక్కలపై చర్యలు తీసుకొవాలని మున్సిపల్ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదులు చేశారు. అయిన దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొలేదు. దీంతో స్థానికులు కాస్తంత వెరైటీగా తమ నిరసనలు తెలియజేశారు. ఏకంగా కొన్ని వీధి శునకాలను సంచుల్లో వేసుకుని వచ్చి మున్సిపల్ అధికారి టేబుల్ మీద వదిలారు.
ఈ ఘటనతో అధికారి ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై తమకు ఎన్నిసార్లు చెప్పిన, ఫోటోలు, వీడియోలను పంపిన చర్యలు ఎందుకు తీసుకొలేదని, దాదాపు ఆరునెలలుగా దీనిపై తమ గొడును చెబుతున్న ఎవరు పట్టించుకొవట్లేదని స్థానిక ప్రజలు, యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే నేతృత్వంలో వచ్చి.. చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భమ్రే కార్యాలయంపై దాడి చేసి టేబుల్ మీద ఏకంగా శునకాలు వదిలి రచ్చ చేశారు.
దీంతో కొంత సేపు ఆఫీసులో గందర గోళం తలెత్తింది. వెంటనే సిబ్బంది అక్కడకు వచ్చి నిరసన కారులను అక్కడి నుంచి బైటకు పంపించి వేశారు.