SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Apple నుంచి మరో మూడు కొత్త ఐఫోన్లు.. iPhone 18, 18e, Air 2 ఫీచర్లు లీక్!

Apple iPhone 18 Series Leaks: వచ్చే ఏడాది మొదట్లో ఐఫోన్ 18 సిరీస్‌ బేస్‌ మోడల్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా ఐఫోన్ 18e, ఐఫోన్ ఎయిర్ 2తో పాటు మరో బేస్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడల్ కూడా అందుబాటులోకి రాబోతోంది. అయితే, వీటి అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియాలో అనేక ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 11:39 IST | Updated: Nov 26, 2026, 11:40 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Apple iPhone 18 Series Leaks: టెక్ దిగ్గజం ఆపిల్ తమ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మరోసారి త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన ఆపిల్.. ఇప్పుడు వచ్చే ఏడాది మొదటి నెలలో మరిన్ని కొత్త మోడళ్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ 18e, ఐఫోన్ ఎయిర్ 2 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది.. వీటి డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాల్లో లీక్‌ అయ్యాయి..

ఈ మూడు మోడళ్లలో  ఐఫోన్ ఎయిర్ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే ఇది 0.4 మి.మీ. తక్కువగా.. అంటే కేవలం 5.2 మి.మీ. మందంతో అత్యంత సన్నని డిజైన్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. సాధారణంగా స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ.. ఆపిల్ ఇందులో 3,500 mAh గల పెద్ద బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక కెమెరా విషయానికొస్తే, ఇందులో వెనుకవైపు అడ్డంగా డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇందులో 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు కొత్త అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 6.55-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, చాలా ప్రత్యేకమైన టైటానియం ఫ్రేమ్‌తో ఇది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

స్టాండర్డ్ మోడల్ అయిన ఐఫోన్ 18 పాత డిజైన్‌నేతో అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొద్దిగా మందంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 6.3-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఎంతో అద్బుతమైన A20 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పాటు 9GB ర్యామ్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే బడ్జెట్, కాంపాక్ట్ మోడల్‌గా లాంచ్‌ కాబోతున్న ఐఫోన్ 18e డిజైన్‌లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో పెద్ద కెమెరా మాడ్యూల్‌ను ఆపిల్ కంపెనీ తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మాడ్యూల్‌లో కేవలం ఒకే ఒక రియర్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయని లీక్‌ వివరాలు చెబుతున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES