SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

షూలో నక్కిన చిన్న కోబ్రా.. సోషల్ మీడియాలో వణుకు పుట్టిస్తున్న వైరల్ వీడియో!

Baby Cobra Video: షూలో నక్కిన చిన్న పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ పాము షూలో ఉండి బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 11:34 AM IST | Updated: Sep 25, 2026, 11:36 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Baby Cobra Video Viral: రోజూ మాదిరిగానే ఉదయాన్నే లేచి.. బూట్లు వేసుకునేందుకు సిద్ధమయ్యేవారికి ఓ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తీవ్ర కలకలం రేపుతోంది.. కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఎంత దారుణంగా పొంచి.. ఉంటుందో స్పష్టం చేసే వీడియో ఒకటి.. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బయటకు వెళ్లేందుకు తీసిన ఒక షూ లోపల ప్రమాదకరమైన పిల్ల కోబ్రా నక్కి కూర్చున్న దృశ్యం ఈ వీడియోలో కరిపిస్తుంది. సాధారణంగా బూట్లను గుమ్మం బయటో లేదా వరండాలో ఉంచుతుంటారు. అయితే, ఆ షూలోకి ప్రమాదకరమైన పాము ఎప్పుడు దూరిందో ఎవరికీ తెలీదు.. తీరా చూసేసరికి అది బూటు లోపల దాక్కుని.. బయకు చూస్తూ అత్యంత ఆగ్రహంతో బసలు కొడుతోంది.. ఎవరైనా ఆ షూలో ఏ మాత్రం తెలియకుండా లోపల కాలు పెట్టి ఉంటే క్షణాల్లో కాటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న పామే అయినప్పటికీ.. నాగుపాము పిల్లలు కూడా పెద్ద పాములతో సమానంగా ప్రమాదకరమైన విషాన్ని చిమ్ముతాయి.

 

 సకాలంలో ఆ పామును గమనించిన వ్యక్తులు అప్రమత్తమై వెంటనే.. నిపుణులైన స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్య్కూ సిబ్బంది ఎంతో చాకచక్యంగా.. ప్రత్యేకమైన స్నేక్‌ స్టిక్‌తో పాముకు ఎలాంటి గాయం కాకుండా షూ నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత దానిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో ఆశ్చర్యపోతున్నారు. ఇకపై షూ వేసుకునే ముందు పదిసార్లు చెక్‌ చేసుకోవాలి.. అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ముందుగానే చూశారు కాబట్టి సరిపోయింది.. లేదంటే పెను ప్రమాదం జరిగేది.. అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. వర్షాకాలం, చలికాలంలో తేమ, చీకటి ఉండే ప్రదేశాల కోసం పాములు, తేళ్లు వంటి విష కీటకాలు ఇళ్ల పరిసరాల్లోకి వస్తుంటాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES