SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బ్యాంక్ సెలవుల క్యాలెండర్.. 4 రోజులు బ్యాంకులు మూసివేత.. ఈ తేదీల్లో ఆన్‌లైన్ సేవలే దిక్కు!

Banks to Remain Closed for 4 Days: సాధారణంగా బ్యాంకులు ప్రతి రోజు పనిచేస్తాయి, కానీ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు కొన్ని పండుగల రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇవి కాకుండా, మీ స్థానిక బ్రాంచ్ తెరిచి ఉందో లేదో, ఏవైనా పనులు ఉంటే ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల వారీగా బ్యాంకు బ్రాంచ్‌లపై కూడా ఆధారపడి ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ బ్రాంచ్‌లు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 22, 2026, 16:25 IST | Updated: Nov 22, 2026, 16:26 IST
Image Credit: Banks to Remain Closed for 4 Days:
Join

Banks to Remain Closed for 4 Days: సాధారణంగా బ్యాంకులు ప్రతి రోజు పనిచేస్తాయి, కానీ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు కొన్ని పండుగల రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇవి కాకుండా, మీ స్థానిక బ్రాంచ్ తెరిచి ఉందో లేదో, ఏవైనా పనులు ఉంటే ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల వారీగా బ్యాంకు బ్రాంచ్‌లపై కూడా ఆధారపడి ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ బ్రాంచ్‌లు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

ఏదైనా బ్యాంకు పని ఉంటే ముందుగానే చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్ లేదా విత్‌డ్రా ఉంటే మాత్రం బ్యాంకుకు వెళ్లాల్సిందే. స్థానిక పండుగల ఆధారంగా కూడా కొన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్‌లు మూసి ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో పనిచేస్తాయి. నవంబర్ 23న మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి. అదే విధంగా నవంబర్ 24న కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. చెక్ డిపాజిట్ లేదా విత్‌డ్రా చేయాలంటే మాత్రం బ్యాంకుకు వెళ్లాల్సిందే.

నవంబర్ 23, సోమవారం నాడు కొన్ని బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉంటాయి. ఆ రోజు సెంగ్‌కుట్ సెన్ సందర్భంగా బంద్‌ ఉంటాయి. ఇది ఒక స్థానిక పండుగ. ఇక్కడ బ్యాంకు సేవలు నిలిచిపోతాయి. నవంబర్ 24, మంగళవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అదే రోజు కార్తీక పౌర్ణమిని కూడా నిర్వహిస్తారు. ఆర్‌బిఐ జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం, ఐజ్వాల్, ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లలో మాత్రం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నవంబర్ 27న కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆ రోజు కనకదాస జయంతి సందర్భంగా బ్యాంకు బ్రాంచ్‌లు మూసివేస్తారు. బెంగళూరు ప్రాంతాల్లో మాత్రం కొన్ని బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది. నవంబర్ 28న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. నవంబర్ 29, ఆదివారం కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి, ఆ రోజు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి బ్యాంకు బ్రాంచ్‌లు ఆ రోజు తెరిచి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని వెళ్లాలి. ప్రతి రెండో మరియు నాలుగో శనివారంతో పాటు ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉంటాయి. అయితే ఏటీఎం సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద మొత్తంలో చెక్ డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా, చెక్ డిపాజిట్ చేయాలన్నా మాత్రం బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లాల్సిందే.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES