• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!

బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!

Students Losing School Days In Bengaluru: బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలు అన్నో ఎన్నో కాపు.. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ప్రభావం విద్యార్థులపై కూడా పడింది. విద్యార్థులు దాదాపు 53 స్కూల్ డేస్ ను రోడ్లపైనే పోగొట్టుకుంటున్నారని ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మరికొన్ని చోట్లనైతే ఊహించని స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ కారణంగా బడికి వెళ్లేందుకు దాదాపు రెండున్నర గంటల పాటు సమయం పడుతుందట..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 02:27 PM IST|Updated: Oct 06, 2026, 02:28 PM IST
joinshare
బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mahesh Babu Favourite Food: మహేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..వెంటనే చెప్పేసిన సూపర్‌స్టార్!

Mahesh Babu Favourite Food: మహేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..వెంటనే చెప్పేసిన సూపర్‌స్టార్!

2

Bigg Boss Telugu 10: అపూర్వను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్.. వరుసగా నామినేషన్స్!

3

Warangal: వరంగల్ జిల్లాలో అమానుషం.. పదోతరగతి బాలికలకు లైంగిక వేధింపులు.! . ఆత్మహత్యాయత్నం.!.

4

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. దాదాపై భారీ బాధ్యత!

5

Saripoyaaru Iddharu Teaser: ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్‌కు అనిల్ రావిపూడి ప్రశంసలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Students Losing School Days In Bengaluru: మన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ సమస్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికులనే కాకుండా ఇప్పుడు చిన్నారుల విద్యభ్యాసాన్ని.. వారి విలువైన సమయాన్ని కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు మింగేస్తూ వస్తున్నాయి.. ప్రతిరోజు బడికి వెళ్లి రావడానికి విద్యార్థులు గంటలకు బస్సుల్లో బందీలుగా మారాల్సిన అవసరం ఏర్పడుతోంది. తాజాగా ఈస్ట్ బెంగుళూరు లోని స్టేట్ హైవే 35 కారిడార్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేకమైన మొబిలిటీ అధ్యయనం ఈ వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ అధ్యయనంలో భాగంగా ఉన్న వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ అధ్యయనం కోసం 61 స్కూల్ బస్సుల నుంచి సేకరించిన జిపిఎస్ డేటాను నిపుణులు క్లుప్తంగా విశ్లేషించినట్లు తెలుస్తోంది. ఈ మార్గం పరిధిలోని దాదాపు 42 పాఠశాలలు, వాటిలో చదివే దాదాపు 40000 మంది విద్యార్థుల ప్రయాణ సమయాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో వెళ్ళడైన వివరాలు తల్లిదండ్రులతో పాటు విద్యావేత్తలను కూడా ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి.

ఈస్ట్ బెంగుళూరు పరిధిలోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోజు రానుపోను దాదాపు రెండు గంటలు కేవలం ప్రయాణానికే కేటాయించాల్సి వస్తుందట.. ఈ కాలాన్ని సంవత్సరంలోని మొత్తం రోజులు లెక్కిస్తే.. ఒక విద్యా సంవత్సరంలో చిన్నారులు దాదాపు 374 గంటల సమయాన్ని రోడ్లపైనే గడుపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అంటే దాదాపు 53 పాఠశాలల పని దినాలు పైనే.. రోడ్ల పైన గడుపుతున్నట్లు అధ్యయనంలో ఆధారాలు చెబుతున్నాయి.. అంటే పిల్లల విలువైన సమయం ట్రాఫిక్ లోనే వృధా అవుతుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి..

మరీ ముఖ్యంగా.. వర్తూరు- మంజూరు మార్గంలో ట్రాఫిక్ తీవ్రత పరాకాష్టానికి చేరుతూ వస్తోంది. కొన్ని రోజుల్లో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి ఒక స్కూల్ బస్సు కు ఏకంగా రెండున్నర గంటల పాటు సమయం పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఈ మార్గంలో బస్సు సగటు వేగం గంటకు కేవలం రెండు. తొమ్మిది కిలోమీటర్లు ఉండడం మరీ విశేషం.. తీవ్ర రద్దీ ఉండే కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం ఏకంగా గంటకు ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల కనిష్ట స్థాయికి పడిపోతూ వస్తోంద.. ఇది ఒక సాధారణ మనిషి నడిచే వేగం కంటే చాలా తక్కువగా చెప్పొచ్చు..

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బస్సుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల విద్యార్థులు తీవ్ర శరీర అలసటతో పాటు కొంతమంది విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి సమస్యలు. దీని ప్రభావం వారి చదువులపై పడటమే కాకుండా ఏకాగ్రతపై పడి, శారీరక ఆరోగ్యం పై నేరుగా ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పాఠశాలల సమయాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలని.. రోడ్ల విస్తరణతో పాటు అద్భుతమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News