Two Class 10 girls suicide attempt in Warangal: సమాజంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై దాడులు, అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ఈ క్రమంలో ప్రతిరోజు మహిళలపై దారుణాలు వార్తలలో ఉంటున్నాయి.పసిపాప నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరిని వదలడంలేదు.ఈ క్రమంలో ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన మహిళలు తిరిగి ఇంటికి రావడం వరకు టెన్షన్ గా మారిందని చెప్పుకొవచ్చు. తాజాగా.. వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇద్దరు టెన్త్ క్లాసు బాలికలపై అఘాయిత్యం చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదకరంగా మారింది. మంగళవారిపేట కోమటిపల్లి తండాలోని స్కూల్లో ఇద్దరు టెన్త్ చదువుతున్న గిరిజన బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. వీరి ఆత్మహత్య యత్నంకు ఇద్దరు యువకుల లైంగిక వేధింపుల కారణమేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వేధింపులకు పాల్పడిన వారిలో.. ఒకరు మహబూబాబాద్ కు జిల్లా కొత్త గూడ మండలంకు చెందిన యువకుడు కాగా, మరోకరు సూర్యాపేట్ జిల్లాకు చెందిన చెందిన యువకుడిగా గుర్తించారు. బాధిత అమ్మాయిల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.