Bigg Boss Telugu 10: ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్లు తమకు నచ్చని వ్యక్తి ముందు ఉన్న కుండను పగలగొట్టి నామినేట్ చేయాల్సి వచ్చింది. కెప్టెన్ వర్షిణితో పాటు సుధీర్, వంశీలకు ఇమ్యూనిటీ ఉండటంతో వారిని నామినేట్ చేసే అవకాశం లేదు. దీంతో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చని వారిని ఎంపిక చేసుకున్నారు.
ముఖేష్, త్రిగుణ్ ఇద్దరూ అపూర్వను నామినేట్ చేశారు. ఆమె కెప్టెన్సీపై ఇద్దరూ ప్రశ్నలు లేవనెత్తారు. ముఖేష్.. కెప్టెన్‌గా అపూర్వ వ్యవహరించిన విధానాన్ని తప్పుబట్టాడు. దీనికి అపూర్వ కూడా గట్టిగానే స్పందించింది. తన నిర్ణయాలను సమర్థించుకునేందుకు ప్రయత్నించింది.
అయితే త్రిగుణ్‌తో జరిగిన చర్చలో అపూర్వకు పరిస్థితి కాస్త కఠినంగా మారింది. త్రిగుణ్ ఆమె కెప్టెన్సీని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమెను ‘డిజాస్ట్రస్ కెప్టెన్’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి అపూర్వ కూడా వరుసగా సమాధానాలు ఇవ్వడంతో వాదన మరింత పెరిగింది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువగా వాదించడం కూడా ఆమెకు కొంత మైనస్‌గా కనిపించింది.
మరోవైపు కెప్టెన్ వర్షిణి కూడా అపూర్వను నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంట్లోకి వచ్చిన తర్వాత అపూర్వలో చాలా మార్పు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించింది. అలాగే అపూర్వ తనతో చెప్పిన విషయాలను వెంటనే రోహిత్‌కు చెబుతోందని ఆరోపించింది.
ఈ సమయంలో అపూర్వ కూడా వర్షిణిపై కౌంటర్ ఇచ్చింది. వర్షిణి కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, నిర్ణయాల్లో ముఖేష్ ప్రభావం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.
ఇప్పటికే అపూర్వ కెప్టెన్సీపై విమర్శలు రావడంతో, హౌస్‌లోని పలువురు అదే అంశాన్ని నామినేషన్స్‌లో ప్రస్తావించినట్లు కనిపించింది. గతంలో నాగార్జున కూడా ఆమె కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఆ పాయింట్ ఆమెకు వ్యతిరేకంగా మారింది.
ఐదో వారం నామినేషన్స్ తొలిరోజే ఆసక్తికరంగా సాగాయి. అపూర్వ చుట్టూ ఎక్కువ చర్చ జరగడంతో ఆమెపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ వారం ఎవరెవరు నామినేషన్‌లో ఉంటారు? ఎవరు సేఫ్ అవుతారు? అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది. నామినేషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో ఇంట్లో మరింత డ్రామా కనిపించే అవకాశం ఉంది.
Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!
Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?