SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: ఇదెం కక్కుర్తీ.. కాసేపట్లో పెళ్లి.. అరగంట పాటు మరో యువతితో గదిలో వరుడి రొమాన్స్.. వీడియో వైరల్..

Bride calls off wedding in UP: రెండు కుటుంబాల మధ్య వరుడు చేసిన పనితో పెద్ద గొడవ జరిగింది. దీంతో వధువు తన పెళ్లిని రద్దుచేసుకుంది. యూపీలోని ఫిరోజాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 23, 2026, 17:06 IST | Updated: Nov 23, 2026, 17:16 IST
Image Credit: firozabad bride calls off wedding video row
Join

Bride Called Off her wedding firozabad: సమాజంలో ఇటీవల చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా పక్కచూపులు చూస్తు కట్టుకున్న వాళ్లను స్కెచ్ లు వేసి మరీ కాటికి పంపుతున్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవల పెద్దది చేసుకుని డైవర్స్ ల వరకు వెళ్లిపోతున్నారు.ఈ క్రమంలో ఇటీవల కొంతమంది భార్యభర్తలు చేస్తున్న పనులు పవిత్రమైన వివాహ వ్యవస్థకే మాయనిమచ్చగా మారింది. ఈ క్రమంలో యూపీలోని ఫిరోజాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 

 

 

ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే  24 ఏళ్ల కాజల్ కు, 26 ఏళ్ల ఆకాశ్ కు పెద్దలు వివాహం నిశ్చయం చేశారు. ఒకరినోకరు ఇష్టపడటంతో .. వీరి పెళ్లి నవంబర్ 20న స్థానికంగా గోపాల్ మ్యారెజ్ హోమ్ లో చేయాలని ఏర్పాట్లు చేశారు. అయితే.. పెళ్లి రోజు రానే వచ్చింది. కాజల్, ఆకాశ్ లు జైమాల మార్చుకున్నారు. అతిథులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. 

ఈ  క్రమంలో వరుడు పెళ్లికి అరగంట ముందు ఒక గదిలో వెళ్లాడు. చాలా సేపటివరకు బైటకు రాలేదు. ఆ తర్వాత అదేగదిలో మరో యువతి సైతం వెళ్లింది. ఇద్దరు కూడా అదే గదిలో చాలాసేపు ఉన్నారు. వీరి యవ్వరం కాస్త ఆడ పెళ్లి వారు గమనించారు. ఆతర్వాత బైటకు వచ్చిన యువకుడ్ని ఈ ఘటనపై నిలదీశారు. ఆకాశ్ దీనిపై పొంతన లేని సమాధానంచెప్పి, దాటవేసేందుకు చూశాడు.ఈ విషయం కాస్త వధువు కాజల్ కు తెలిసింది. దీంతో ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆకాశ్ తనను మోసం చేశాడని యువతి తన పెళ్లిని రద్దుచేసుకుంది. 

పెళ్లిదుస్తుల్లోనే యువతి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి వరుడు ఆకాశ్ పై ఫిర్యాదు చేసింది. వరుడు మాత్రం ఆమె తన స్నేహితుడి సోదరి అని తనను కలిసేందుకు వస్తే ఇలా గొడవ చేశారని చెప్పుకొచ్చాడు. కలిసేందుకువస్తే గదిలోపలి నుంచి గడియ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించగా దానికి సరైన సమాధానం చెప్పలేదు. మొత్తంగా ఈ విషయం కాస్త రచ్చగా మారడంతో వధువు పెళ్లి రద్దుచేసుకుని, పెళ్లి ఖర్చులు ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా దుమారంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES