Revanth Reddy vs BRS Party: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమగ్ర విశ్లేషణ, వివరణ ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ హయాంలోనే అనుమతులు లభించాయని రేవంత్ రెడ్డి సాక్ష్యాలతో వివరించారు. కానీ ప్రణాళికబద్దంగా బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పల్నాడు గ్రిడ్‌పై ప్రణాళిక బద్దంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. హరీశ్ రావు, కేటీఆర్ మాపై ఎదురుదాడి నిరాధారంగా చేస్తోంది. ఆనాడు ఏపీకి ఎలా తాకట్టు పెట్టిందో ఆధారాలతో బయటపెడుతున్నా. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడంతోనే నమ్మే అవకాశం ఉంటుంది. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై జీఓ 56ను ఆనాడు 2022న విడుదల చేశారు. రూ.1,200 కోట్ల అంచనాతో కేంద్రం భరించేలా గుంటూరులో నిర్మాణం కోసం చేశారు. మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.500 కోట్లు భరించడం స్పష్టంగా ఉన్నాయి' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఆనాడు మీరే ఉన్నారు కదా? బడ్జెట్ ఆమోదం తెలిపినప్పుడు హరీశ్ రావు మంత్రిగా ఉన్నారు కదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో నాయిని నరసింహా రెడ్డి ఇన్‌చార్జ్‌గా, హరీశ్ రావు అదే మంత్రివర్గంలో ఉన్న 2005లో పోతిరెడ్డి పాడుపై నిర్ణయం జరిగింది. వైఎస్సార్‌కు హరీశ్ రావు గురుదక్షిణ చెల్లించుకున్నాడు. వార్డ్ సభ్యుడు కాకున్నా మంత్రిని చేశాడనే కారణంతో హరీశ్ రావు గురుదక్షిణ చెల్లించాడు' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.