SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

100 అడుగుల పొడవైన రూ.500 నోట్ల మాలలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే సర్‌ప్రైజ్!

Viral Video: ఇద్దరు బావమరుదులకు తన బావ అందించిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.. ఈ గిఫ్ట్ ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. అసలు ఈ గిఫ్ట్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 12:18 IST | Updated: Nov 22, 2026, 12:20 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Viral Video: భారతీయ సాంప్రదాయంలో వివాహ వేడుకలు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి. ఆత్మీయుల అనుబంధాలతో పాటు ఆశ్చర్యపరిచే కానుకలకు వేదికగా నిలుస్తూ ఉంటాయి.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మధురాలు జరిగిన ఒక వివాహ వేడుక ఎందుకు నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. తన బావమరుదుల వివాహం సందర్భంగా ఓ బావ ఇచ్చిన అత్యంత ఖరీదైన, అరుదైన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఆ బహుమతి ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోతున్నారు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మధుర లో జరిగిన ఈ పెళ్లిలో ఇద్దరు వరులకు వారి భావ ఊహించని రీతిలో సర్ప్రైజ్ అందించారు. తన బావ మరదలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా ఒక్కొక్కరికి దాదాపు రూపాయలు కోటి విలువ చేసే కరెన్సీ నోట్ల దండలను గిఫ్ట్ అందించాడు.. మొత్తం రూ.500 నోట్లతో అద్భుతమైన భారీ దండలను తయారుచేసి వారికి వేశాడు. ఏకంగా రెండు కోట్ల విలువైన నోట్ల మాలలను వేయడం చూసి పెళ్లికి హాజరైన అతిథులంతా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ఈ వివాహ వేడుకను చూసి ఎందుకు? అక్కడికి తరలివచ్చారు..

సాధారణ పూలదండల మాదిరిగా కాకుండా. ఈ కరెన్సీ దండలు సుమారు 100 అడుగుల పొడవున్నాయట. అంత భారీ మొత్తంలో రూ.500 నోట్లను ఒక్కొక్కటిగా పేర్చి తయారు చేయడంతో దండ బరువు కూడా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని నేరుగా మెడలో వేసుకుని నేలపై నిలబడి మోయడం వారిద్దరికీ కష్టతరంగా మారింది. దీంతో వారిద్దరు ఓ అద్భుతమైన ఆలోచన చేసి ఇంటి పైకప్పు ఎక్కారట. పై కప్పు మీద నిలబడి వరులు ఆ నోట్ల దండలను ధరించగా.. కింద ఉన్న కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఆ పొడవాటి నోట్ల మాలలను కిందకు జారకుండా జాగ్రత్తగా పట్టుకుని సహాయం చేశారు..

ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్నవారు స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వీడియో క్షణాల్లో వైరల్ అవుతూ వచ్చింది. బావ మరదల పట్ల బావ చూపిన ప్రేమ.. ఆర్థిక అండను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు.. బావ అంటే ఇలా ఉండాలి.. జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన గిఫ్ట్ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. మధురాలు జరిగిన ఈ వివాహ వేడుక స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES