• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఇలాంటి ప్లాన్ ఎక్కడా చూసి ఉండరు.. BSNL రూ.2,449 రీఛార్జ్‌తో 380 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌..!

ఇలాంటి ప్లాన్ ఎక్కడా చూసి ఉండరు.. BSNL రూ.2,449 రీఛార్జ్‌తో 380 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌..!

ప్రతినెలా మొబైల్‌ రీఛార్జీతో పనిలేదు.. ఒక్క ప్లాన్‌తో ఏడాది మొత్తం వ్యాలిడిటీ లభించే ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2449 ప్లాన్‌. ఇందులో డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తోపాటు మరిన్ని బెనిఫిట్స్‌ పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 19, 2026, 10:46 IST|Updated: Nov 19, 2026, 10:49 IST
joinshare
ఇలాంటి ప్లాన్ ఎక్కడా చూసి ఉండరు.. BSNL రూ.2,449 రీఛార్జ్‌తో 380 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌..!
Image Credit: BSNL Rs 2449 Recharge Plan:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BSNL Rs 2449 Recharge Plan: ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ప్లాన్‌ తీసుకువచ్చింది.  ప్రతినెలా రీఛార్జీ గొడవ లేకుండా ఒక్కసారి రీఛార్జీ చేస్తే ఏడాది మొత్తం వ్యాలిడిటీ లభిస్తుంది. అదే రూ.2449 రీఛార్జీ ప్లాన్‌. దీని వ్యాలిడిటీ ఎక్కువగా ఉండటంతోపాటు డేటా, బీమా కవరేజీ కూడా పొందుతారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2449 ప్లాన్‌..
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2449 ప్లాన బెస్ట్‌. తరచూ రీఛార్జీ చేసుకునే అవసరం లేకుండా ఒక్కసారి రీఛార్జీ చేస్తే ఏడాది మొత్తం వ్యాలిడిటీ లభించే ప్లాన్‌. ఇది మొత్తం 380 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌పై ఆఫర్‌లో భాగంగా అదనంగా 15 రోజులు ఎక్కువ పొందుతారు.

దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఈ ప్లాన్‌ ఫీచర్స్‌ అన్నీ కూడా 380 రోజులపాటు పొందుతారు. కేవలం రూ.2449 రీఛార్జీ చేస్తే సరిపోతుంది. 2026 నవంబర్‌ 30వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ పొందుతారు.

ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అంటే వ్యాలిడిటీ మొత్తంలో 760 జీబీ లభిస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ వాడేసినా కానీ, 40 కేబీపీఎస్‌ నెట్‌ పొందుతారు.

అపరిమిత వాయిస్‌ కాల్స్‌.. ఎస్‌ఎంఎస్‌..
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ రీఛార్జీ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌ కూడా పొందుతారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2449 ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు.

యాక్సిడెంటల్‌ డెత్‌ ఇన్సూరెన్స్‌..
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రత్యేక ప్లాన్‌లో యాక్సిడెంటల్‌ డెత్‌ బీమా రూ.1 లక్ష పొందవచ్చు. ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (OICL) సమన్వయంతో ఈ కవరేజీ అందిస్తోంది. ఇందులో రోడ్‌ యాక్సిడెంట్స్‌, కరెంట్‌ షాక్‌, పాముకాటు, ఫైర్‌ యాక్సిడెంట్‌ కూడా కవర్‌ అవుతుంది. అయితే, సదరు బీమా కంపెనీకి ఘటన జరిగిన 48 గంటలలోపే తెలియజేయాల్సి ఉంటుంది.

సైబర్‌ ఇన్సూరెన్స్‌..
సైబర్‌ మోసాలు తరచూ ఈ మధ్య కాలంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌, బ్యాంకింగ్‌ పెరగడంతో ఇలా జరుగుతోంది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌తో రూ.10 వేల సైబర్‌ ఇన్సూరెన్స్‌ కూడా అందిస్తోంవి. ఇది సైబర్‌నేరాు, ఫిషింగ్‌, ఈమెయిల్‌ స్పూఫింగ్‌ కూడా కవర్‌ చేస్తుంది.

అయితే, ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసిన 24 గంటల తర్వాత బీమా యాక్టివేట్‌ అవుతుంది. ఇందులో మీరు మొబైల్‌ నెంబర్‌ గరిష్టంగా మూడుసార్లు ఏడాదిలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. సైటర్‌ మోసం జరిగితే వెంటనే 72 గంటల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Recharge Plans
Telugu News