SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రిషికేశ్ హైవేపై పెను ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు..!

Bus Accident Rishikesh: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రిషికేష్ -బద్రీనాథ్ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. 35 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం పెను ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయం అందించే పనిలో పడ్డారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 09:01 IST | Updated: Nov 17, 2026, 09:02 IST
Image Credit: Bus Accident (X/Source)
Join

Rishikesh badrinath Ntational highway Bus Accident: మంగళవారం ఉదయం  రిషికేష్ - బద్రినాథ్ నేషలన్ హైవే పై పెను ప్రమాదం చోటు చేసుకుంది. రిషికేష్- బద్రినాథ్ జాతీయ రహదారిలో ఉన్న  గులార్ సమీపంలో ఒక వంతెన కింద సుమారు 100 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి ప్రయాణికులతో వెళుతున్న  బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన ఉదయం 5.30 గంటలకు జరిగినట్టు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడంతో అప్పటికే జరిగాల్సిన ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్న మాట.

ఆరుగురి మరణం.. 
ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సు రిషికేశ్ నుంచి శ్రీనగర్‌కు  వెళుతుంది. బస్సులో సుమారు 30 నుంచి 35 మంది  ప్రయాణిలున్నట్టు సమాచారం. 30 లేదా 35 మందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయమై ట్రావెల్ ఏజెన్సీ వాళ్లతో పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ప్రమాద ఘనట  సమాచారం అందిన వెంటనే, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు, దగ్గరలోని బయాసి,  ధల్‌వాలా పోస్టుల నుండి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.  గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరిలించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించే పనిలో పడ్డారు.


పోలీసుల చెప్పిన  కథనం ప్రకారం..

పోలీసు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం గులార్ సమీపంలో UK09PA9779 నంబరు గల బస్సు లోయలో పడిపోయినట్లు డయల్ 112 ద్వారా ఒక కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే, ముని కి రేతి పోలీస్ స్టేషన్, గులార్, శివపురి,  బయాసి అవుట్‌పోస్టుల నుండి పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి వెంటనే  చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళంతో పాటు  అంబులెన్స్ బృందాలను వెంటనే  సంఘటనా స్థలానికి  చేరుకున్నారు. పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది లోయలోకి దిగి లోపల చిక్కుకున్న ప్రయాణికులను రక్షించే పనిలో పడ్డారు. వంతెనకు సుమారు 100 మీటర్ల దిగువన ఉన్న ఒక వాగులో బస్సు పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

బస్సుకు తీవ్ర నష్టం..

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే, పోలీసులు,  ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు లోయలోకి దిగి ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.  ఇప్పటివరకు, సుమారు 20 మంది గాయపడిన వారిని రక్షించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బయాసి,  ధల్లా పోస్టులకు చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై  ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కనిపించకుండా పోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES