ఈ iPhone డ్యూయో ధర రూ.20 లక్షలు.. మంచి లగ్జరీ కారు వస్తుంది భయ్యా!
Caviar Liquid Metal iPhone Duo Price: ఐఫోన్ డ్యూయో (iPhone Duo)ను ప్రముఖ కంపెనీ కేవియర్ మార్కెట్‌లోకి లిక్విడ్ మెటల్ ఎడిషన్ (Liquid Metal Edition)లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీని లుక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Caviar Liquid Metal iPhone Duo Price: యాపిల్ స్మార్ట్‌ఫోన్లంటేనే మార్కెట్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది వాటిని గోల్డ్‌తో పాటు వెండి, వజ్రాలతో రీడిజైన్ చేసిన అమ్మితే.. అయితే, లగ్జరీ కస్టమైజేషన్ బ్రాండ్ కేవియర్ కూడా ఇదే పని చేస్తూ వస్తోంది. యాపిల్ విడుదల చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయో (iPhone Duo) కోసం కేవియర్ సరికొత్త లిక్విడ్ మెటల్ ఎడిషన్ (Liquid Metal Edition)ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ స్టెర్లింగ్ సిల్వర్‌తో విడుదల చేసిన్నట్లు తెలుస్తోది. అయితే, దీనిని ధర రూ.20 లక్షలకు పైగానే ఉండబోతున్నట్లు వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ బాడీని కంపెనీ స్టెర్లింగ్ సిల్వర్ (Sterling Silver)తో తయారు చేసిన్నట్లు తెలిపింది.. ఫోల్డబుల్ డిజైన్‌కు సరిపోయేలా.. వెనుక ప్యానెల్‌పై ఫ్లూయిడ్ స్కల్ప్చరల్ లైన్స్ (Fluid Sculptural Lines)తో పాటు మిర్రర్ ఫినిషింగ్ కూడా అందించారు. అలాగే ఫోన్ వెనుక ఉండే యాపిల్ లోగో కూడా 3D స్టెర్లింగ్ సిల్వర్‌తో ఎంతో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.
ఈ లిక్విడ్ మెటల్ ఐఫోన్ డ్యూయోను కేవియర్ అత్యంత తక్కువ సంఖ్యలో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 యూనిట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. కేవియర్ అధికారిక సమాచారం ప్రకారం.. దీని 256GB మోడల్ ప్రారంభ ధర..రూ. 18,840 డాలర్లు అంటే.. దాదాపు రూ.16 లక్షలకు పైగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టాప్-ఎండ్ 2TB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో ట్యాక్సులతో కలిపి దాదాపు రూ.20 లక్షల వరకు అవుతుంది..
భారత్‌లో సాధారణ యాపిల్ ఐఫోన్ డ్యూయో 256GB బేస్ వేరియంట్ ధర సుమారు రూ.2,99,900 కాగా.. 2TB మోడల్ ధర దాదాపు రూ.4,49,900 వరకు ఉంది. అయితే, కేవియర్ కస్టమ్ ఎడిషన్ మాత్రం ఏకంగా ఓ లగ్జరీ కారు ధరకు లభిస్తుండడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 5.4 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 7.6 అంగుళాల భారీ ఇన్నర్ డిస్‌ప్లే అందుబాటులోకి రావడం విశేషం.
ధర ఎంతైనా సరే ప్రత్యేకమైన, విలాసవంతమైన గ్యాడ్జెట్లను వాడాలనుకునే ప్రపంచ కుబేరులు, లగ్జరీ ప్రియులను దృష్టిలో ఉంచుకునే కేవియర్ ఈ సరికొత్త లిక్విడ్ మెటల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఒకే ఫోన్‌పై లక్షల రూపాయల ఖర్చుతో వచ్చిన ఈ లగ్జరీ మోడల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.