Chandigarh Telugu News: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు కుటుంబంలోనే ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది.. చండీగఢ్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఒక అధికారి తన సొంత నివాసంలోనే దారణ హత్యకు గురయ్యాకు.. తెల్లవారుజామున గుర్తుతెలియని ఆయుధంతో కాల్పులు జరపడంతో ఆయన ఇంట్లోనే ప్రాణాలు విడిచిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశమైంది.
చండీగఢ్‌లోని సెక్టార్-22 నివాసంలో హెడ్ కానిస్టేబుల్ నితిన్ తన కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవితం కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ఆయన పోలీస్ శాఖలోని అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం సమయంలో ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. తీవ్ర రక్తస్రావంతో నితిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. కాల్పుల శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.. సమాచారం అందుకున్న వెంటనే సెక్టార్-17 పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులతో పాటు ఎస్ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన్నట్లు తెలుస్తోంది.. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగానే.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ప్రాథమికంగా కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసే క్రమంలో మృతుడి మైనర్ కుమారుడు అర్మాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడం ప్రారంభించాడట... ఎవరో గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి వచ్చి.. తండ్రిపై కాల్పులు జరిపి పారిపోయాడని మొదట కట్టుకథలు చెప్పటిన్నట్లు తెలుస్తోంది.. అయితే, అతడి ప్రవర్తనతో పాటు మాటల్లోని తేడాలను గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. విచారణలో నిమిషానికో మాట మారుస్తుండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడిందని అధికారు తెలుపుతున్నారు..
పోలీసుల ప్రాథమికంగా చేసిన విచార ప్రకారం.. సదరు మైనర్ బాలుడికి గతంలోనూ.. నేర చరిత్ర ఉన్నట్లు తెలిందట.. అంతేకాకుండా గతంలో జరిగిన ఒక కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న అతడు.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసు అధికారు వెల్లడించారు.. ఇంట్లో తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన గొడవ జరిగిఉంటుందా? లేక ఆ పాత వ్యవహారాల నేపథ్యంలోనే ఈ దారుణం చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.