Snake stuck in heavy vehicle tyre video: పాముల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. నెటిజన్ లు సైతం దీన్ని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే ఎక్కడ పాములు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డు చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. మరోవైపు పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. కొంత మంది రీల్ లు, వీడియోలు తీస్తు డెంజర్ లో పడతారు. కొన్నిసార్లు స్టంట్ లు చేసే క్రమంలో పాము కాటు ఘటనలు కూడా జరుగుతాయి.
ट्रक के टायर के अंदर छुपा जहरीला कोबरा बाहर निकलकर दिखाने लगा फन, लोग छेड़ रहे देखकर डर से भागे 👽🥺 https://t.co/WaWn0HWyg4
— Promila (@ImPromila) October 5, 2026
ఈ క్రమంలో అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తారు. పాములు చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసం చేస్తాయి.అందుకు కార్ లలో, బూట్లలో, గుబురుగా ఉండే చెట్ల మధ్యన కోబ్రాలు నక్కి ఉంటాయి. ఏ ుమాత్రం నెగ్లీజెన్సీగా ఉన్నా కూడా పాము కాటు ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం ఒక పాము భారీ టైర్ లోకి దూరింది.
సాధారణంగా భారీ వాహనాలను రోడ్లపక్కన, చెట్లపక్కన పార్క్ చేస్తారు. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు పాములు వీటిలోకి దూరుతాయి. ఇప్పుడు కూడా ఒక పాము భారీ వాహనం టైర్ లోకి దూరింది. అది రంధ్రం గుండా బైటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారు గమనించి పామును బైటకు తీద్దామని ప్రయత్నించారు.
కానీ పాము పదే పదే బుసలు కొడుతూ వారిపైన దాడి చేసింది. కోపంతో దాడి చేసి కోబ్రా చుక్కలు చూపించింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.