• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

China Underarm Hair Trend Telugu: చైనాలోని యువతులంతా ఇప్పుడు చంకలో వెంట్రుకలకు కలర్ కలర్ రంగులు వేసుకొని కొత్త నిరసనను చేపడుతున్నారు. అసలు ఈ నిరసనకు గల కారణం ఏంటి? సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 10:35 AM IST|Updated: Oct 06, 2026, 10:38 AM IST
joinshare
చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్..  పార్లమెంట్ నుంచి ఈసీకి  ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..

India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. పార్లమెంట్ నుంచి ఈసీకి ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..

2

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

3

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

4

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

5

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

China Underarm Hair Trend Telugu News: శతాబ్దాలుగా మహిళల శరీరం ఎలా ఉండాలి! వారు ఎలా కనిపించాలి అనే విషయాలను సమాజం చెబుతూనే వస్తోంది. ముఖ్యంగా శరీర సౌందర్యం విషయంలో కొన్నిచోట్ల అవయవాల దగ్గర ఉండే రోమాలు లేకుండా నున్నగా కనిపించేలా ఉండాలనేది ఎప్పటినుంచో వస్తున్న ఒక నియమం.. అంతేకాకుండా వాటిని ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచాల్సి అవపరం కూడా ఉంటుంది.. కానీ చైనాకు చెందిన కొందరు యువతులు తమ వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఆత్మవిశ్వాసానికి, ప్రతీకగా ఈ రోమాలను మార్చుకుంటున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చంక భాగంలోని వెంట్రుకలను తొలగించుకోవడానికి బదులుగా.. చైనాలో ఇప్పుడు వాటికి నీలంతో పాటు గులాబీ రంగు, పసుపు పచ్చ ముదురు రంగులు అది సోషల్ మీడియాలో యువతులు ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది..  గతంలో చైనాలోని సినీ పెద్దలు చంకలోని వెంట్రుకలు అశుభ్రతకు, అశుభానికి చిహ్నంగా భావించే వారట.. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకొని చైనా యువతులు నేరుగా ప్రశ్నిస్తూ.. సహజంగా వచ్చే శారీరక మార్పులను అసహ్యించుకోవాల్సిన అవసరం లేదని.. ప్రకృతి సిద్ధమైన శరీర తత్వాన్ని స్వీకరించడంలోనే నిజమైన ఆత్మగౌరవం ఉందని.. వారు చంకలోని వెంట్రుకలకు రంగులు వేస్తూ.. వారన్నది తప్పని ఇలా వినుత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.. తమ శరీరంపై పూర్తి హక్కు తమకే ఉందని చాటి చెప్పడమే ఈ రంగుల వెనక ఉన్న అసలు ఉద్దేశం అని వారంటున్నారు..

మొదట ఇది చూసేవారికి విచిత్రంగా అనిపించినప్పటికీ.. అక్కడికి వెళ్లిన టూరిస్టులు మాత్రం దీనిని ట్రెండ్గా భావిస్తూ వస్తున్నారు. కానీ యువత మాత్రం సమాజం నిర్ణయించిన మూస పద్ధతులను సున్నితంగా తిరస్కరించే ఒక నిశ్శబ్ద తిరుగుబాటుగా చూస్తున్నారు. ఎవరికోసం మనం మారాలి? శ్రీ శరీరం పట్ల ఏది మంచిది.. ఏది కాదు అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉందని.. అక్కడ యువత సోషల్ మీడియాలో ఇలా కలర్స్ వేస్తూ ట్రెండును లేవనెత్తుతున్నారు..

ఈ సోషల్ మీడియా ట్రెండ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. యువతరం మాత్రం దీనిని.. వారు వ్యక్తిగతంగా చేస్తున్న యుద్దంగా పరిగణిస్తూ వస్తున్నారు. ఫ్యాషన్ తో పాటు కళ, నిరసన.. వీటన్నింటి కలయికగా కనిపించే ఈ ఘటన అంతిమంగా మహిళల స్వేచ్ఛను సూచిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇతరుల గుర్తింపు కోసం.. లేదా నిబంధనల కోసం కాకుండా.. తనను తాను ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి మహిళకు ఉందనే ఈ సందేశాన్ని.. ప్రస్తుతం ఈ ట్రెండ్ బలంగా చాటి చెబుతోంది..

NOTE: ఈ సమాచారం సోషల్ మీడియాల్లో పోస్టుల ఆధారంగా తీసుకుని రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్‌ అస్సలు ధృవీకరించదు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News