SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

Cobra Video: టైర్ లో నుంచి పాము బైటకు వచ్చి పలు మార్లు బుసలు కొట్టింది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 06, 2026, 10:58 AM IST | Updated: Oct 06, 2026, 11:02 AM IST
Image Credit: Cobrstuckintyrevideoviral
Join

Snake stuck in heavy vehicle tyre video: పాముల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి.  నెటిజన్ లు సైతం దీన్ని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే ఎక్కడ పాములు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డు చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. మరోవైపు పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. కొంత మంది రీల్ లు, వీడియోలు తీస్తు డెంజర్ లో పడతారు. కొన్నిసార్లు స్టంట్ లు చేసే క్రమంలో పాము కాటు ఘటనలు కూడా జరుగుతాయి. 

 

 

ఈ క్రమంలో అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తారు. పాములు చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసం చేస్తాయి.అందుకు కార్ లలో, బూట్లలో, గుబురుగా ఉండే చెట్ల మధ్యన కోబ్రాలు నక్కి ఉంటాయి. ఏ ుమాత్రం నెగ్లీజెన్సీగా ఉన్నా కూడా పాము కాటు ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం ఒక పాము భారీ టైర్  లోకి దూరింది. 

సాధారణంగా  భారీ వాహనాలను రోడ్లపక్కన, చెట్లపక్కన  పార్క్ చేస్తారు. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు పాములు వీటిలోకి దూరుతాయి. ఇప్పుడు కూడా ఒక పాము భారీ వాహనం టైర్ లోకి దూరింది. అది రంధ్రం గుండా బైటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారు గమనించి పామును బైటకు తీద్దామని ప్రయత్నించారు. 

 

కానీ పాము పదే పదే బుసలు కొడుతూ వారిపైన దాడి చేసింది.  కోపంతో దాడి చేసి కోబ్రా చుక్కలు చూపించింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES