SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అసలేం ధైర్యంరా బాబూ.. మొసలి పిల్లను ఎత్తి జిమ్ చేసిన యువకుడు!

Crocodile Workout Video: తాజాగా ఓ యువకుడు డంబిల్స్‌కు బదులుగా అత్యంత ప్రమాదకరమైన మొసలి పిల్లను పట్టుకొని వ్యాయామాలు చేస్తూ కనిపించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 26, 2026, 03:31 PM IST | Updated: Sep 26, 2026, 03:33 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Crocodile Workout Video Goes Viral: సాధారణంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు డంబుల్స్‌తో పాటు బార్బెల్స్, ఐరన్ ప్లేట్స్‌ను ఉపయోగించి బరువును ఎత్తుతో ఉండడం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. శరీర దృఢత్వాన్ని పెంచుకోవడానికి వివిధ పరికరాలను వాడడం సర్వసాధారణమే.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేస్తున్నాయి. ఒక గంటలు తిరిగిన యువకుడు ఇంటివద్దె జిమ్ పరికరాలకు బదులుగా.. బరువున్న మొసలి పిల్లను చేతుల్లోకి తీసుకొని వింత వర్కౌట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్ ను పరిశీలిస్తే.. మంచి కండరాలు కలిగిన ఒక యువకుడు నేలపై నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. అతడి చేతుల్లో డంబిల్స్‌కు బదులుగా కాస్త పెద్ద సైజులో ఉన్న మొసలి పిల్ల ఉండడం మీరు గమనించవచ్చు. ఆ ప్రమాదకరమైన జీవిని రెండు చేతుల పట్టుకొని.. ఏమాత్రం భయం లేకుండా పైకి కిందికి ఎత్తుతూ.. బరువులెత్తే వ్యాయామం చేస్తూ కనిపించేసాడు. అయితే, ఈ సమయంలో ఆ ముసలి కూడా ఏమాత్రం కదలకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది..

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ యువకుడిపై.. మొసలి ఎదురుదాడి చేయకుండా అతని చేతుల్లో స్థిరంగా ఏమాత్రం కదలకుండా ఉండిపోయింది.. అయితే ఏ క్షణమైనా అది ఒక్కసారిగా తిరగబడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న మొసలి కూడా చాలా ఆగ్రహంతో చూస్తున్నట్లు మీరు గమనించవచ్చు.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు... ఇది ధైర్యం కాదు.. కేవలం లైస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే అమాయకత్వం అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది మూగజీవాలను ఇలా వినోదం కోసం వినియోగించడం వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు అత్యంత విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా మూగజీవాలతో ఆటలాడడం సరికాదని చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కాలంలో రీల్స్‌తో పాటు, వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంత రిస్క్ అయిన తీసుకోవడానికి వెనకాడడం లేదు.  క్రూరమైన జంతువులతో ఇలాంటి ఫీట్లు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES